• December 9, 2021

RRR Trailer : పులితో ఎన్టీఆర్.. అగ్గితో రామ్ చరణ్.. పీక్స్ ఎలివేషన్స్!

RRR Trailer : పులితో ఎన్టీఆర్.. అగ్గితో రామ్ చరణ్.. పీక్స్ ఎలివేషన్స్!

    రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ పది గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక వీటికి సంబంధించిన వీడియోలు స్క్రీన్ షాట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్ సీన్స్, అగ్గితో రామ్ చరణ్ ఆడే ఆటలు, వేసే బాణాలు, బైక్‌తో ఎన్టీఆర్ చేసే ఫైట్ సీక్వెన్స్, రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి చేసే ఫైట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్టుగా ఉన్నాయి.

    ఒక్కో సీన్ ఒక్క షాట్ మాస్‌కు పిచ్చెక్కించేలా ఉన్నాయి. మెగా నందమూరి అభిమానులు అయితే చొక్కాలు చించుకోవడం ఖాయం. థియేటర్లో ట్రైలర్ వస్తుంటే ఏ ఒక్కరూ కూడా కూర్చిల్లో కూర్చుని కనిపించలేదు.  రాజమౌళి తెరకెక్కించిన ఒక్కో షాట్‌ను గొంతుపోయేలా అరిచేస్తున్నారు. మొత్తానికి ఎన్నో రోజుల కల నేడు నెరవేరింది.

    ఇక మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పులితో కలిసి చేసే విన్యాసాలు మాత్రం మామూలుగా ఉండవని తెలుస్తోంది. అలా ఒకే ఫ్రేమ్‌లో రెండు పులులను చూసినట్టు అనిపించాయి. రాజమౌళి తన హీరోలను ఏ స్థాయిలో చూపిస్తాడో మరొక్కసారి నిరూపించాడు. ఇక రామ్ చరణ్‌కు పెట్టిన షాట్లను చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

    ఆ రాముడే విల్లు పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ బాణాలు వేసే తీరు, చూపించిన విధానం, నిప్పుతో చెలగాటమాడటం ఇవన్నీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక యూట్యూబ్‌లో ట్రైలర్ వస్తే రికార్డులన్నీ బద్దలవుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు సోషల్ మీడియాలో ట్రైలర్‌ను వదులుతామని చెప్పిన సంగతి తెలిసిందే.

    కానీ అభిమానుల జోష్‌ను చూసిన చిత్రయూనిట్ మాత్రం అభిమానులకు కాస్త ముందుగానే ట్రీట్ ఇవ్వబోతోంది. నేటి ఉదయం 11 గంటలకే ట్రైలర్‌ను యూట్యూబ్‌లో వదులుతామని ప్రకటించింది. దీంతో అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో వ్యూస్, లైక్స్ రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్నారు.

    ఇక ఈ ట్రైలర్‌లో ఎన్నో అనుమానాలు వదిలాడు. పులిని వేటాడాలంటే వేటగాడు కావాలి అనే టైంలో రామ్ చరణ్ ఎంట్రీ.. భీంను పట్టుకునేందుకు సీతారామరాజును వాడినట్టు కనిపిస్తోంది. ఇక ఇందులో భీం, రామ్ స్నేహం హైలెట్ అయ్యేట్టుంది. ఒక్కొక్కకరికి రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ల సీన్లు అదిరిపోయాయి.

    అలియా భట్, సముద్రఖని, శ్రియా, అజయ్ దేవగణ్ ఇలా ప్రతీ ఒక్కరి పాత్ర అదిరిపోయింది. ఇక పులితో ఎన్టీఆర్ వేట మాత్రం మామూలుగా ఉండదని అర్థమైపోయింది.

    Leave a Reply