• December 11, 2021

RRR Movie : ముప్పై ఏళ్లు దాటాయ్.. పెళ్లిళ్లైనా ఆ పనులే.. చెర్రీ, తారక్‌ల పరువుతీసిన రాజమౌళి

RRR Movie : ముప్పై ఏళ్లు దాటాయ్.. పెళ్లిళ్లైనా ఆ పనులే.. చెర్రీ, తారక్‌ల పరువుతీసిన రాజమౌళి

    Ram Charan Jr NTR రామ్ చరణ్, ఎన్టీఆర్ బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే వీరిద్దరు మంచి స్నేహితులు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఈ ఇద్దరినీ రాజమౌళి ఒక దగ్గరకు తీసుకురావడంతో మరింత బంధం పెరిగింది. అలా షూటింగ్‌లో దాదాపు మూడేళ్లు కలిసే ఉన్నారు. అలా ఇంకా దగ్గరయ్యారు. అయితే ఈ ఇద్దరి గురించి రాజమౌళి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

    తాను ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను 300 రోజులు చేసి ఉంటే.. అందులో కనీసం 20 నుంచి 25 రోజులు ఈ ఇద్దరి వల్లే వేస్ట్ అయ్యాయ్ అని రాజమౌళి చెబుతూ ఉంటే.. ఎన్టీఆర్ చెక్కలి గింతలు పెట్టేశాడు. దాంతో ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు రాజమౌళి. ఆమడ దూరంకు వెళ్లి తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసేశాడు. అలా రాజమౌళి ఈ ఇద్దరు హీరోలు చేసిన పనుల గురించి చెప్పుకొచ్చాడు.

    ఇదిగో ఇలాంటి పనులు చేశారు.. ఎన్టీఆర్ వస్తాడు.. చరణ్ గిల్లుతున్నాడు అని చెబుతాడు.. చరణ్ ఏమో అమాయకంగా ఫేస్ పెట్టి నేను అలా చేయలేదు సర్ అని అంటాడు. ఈ ఇద్దరి వల్ల ఎన్నో సమస్యలు అనుభవించాను.. ఇద్దరికి ముప్పై ఏళ్లు దాటాయ్.. పెళ్లిళ్లు అయ్యాయ్.. లక్షల, కోట్ల మంది అభిమానులున్నారు.. అయినా కూడా చిన్నపిల్లల్లా సెట్స్‌లో అల్లరి చేస్తుండేవారు అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

    మరో వైపు అలియా భట్ కూడా.. చెర్రీ, తారక్ బంధం గురించి చెప్పుకొచ్చింది. పక్కన నేను ఉన్నాననే విషయాన్ని కూడా మరిచిపోతారు.. వారిద్దరే మాట్లాడుకుంటారు.. ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని లాక్కుంటారు.. చిన్న పిల్లల్లా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు అని అలియా భట్ కూడా అనేసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ మాత్రం గిల్లుకోడాలు, నవ్వుకోడాలు, కౌంటర్లతో బాగానే నడిచింది.

    Leave a Reply