- November 17, 2021
అరియానా నడుమును వాడేశారు.. రాజ్ తరుణ్ మామూలోడు కాదు

అరియానా కాస్త ఇలియానాల ఫీలవుతుంటుంది. బిగ్ బాస్ ఇంట్లో అరియానా అందాలు, ఆమె నడుము, నాభి అందాలు బాగానే ఫేమస్ అయ్యాయి. బోల్డ్ పాపగా పేరు తెచ్చుకున్న అరియానా.. ఆర్జీవీ ఇంటర్వ్యూ తరువాత మరింత బోల్డ్‌గా మారింది. అరియానాతో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ మామూలుగా ఉండదు. ఏకంగా అరియానా బాడీ పార్టుల మీద కామెంట్ చేశాడు. తొడలు, బ్యాక్ అంటూ నానా రకాల చండాలపు కామెంట్లు చేశాడు.
ఆ సమయంలో ఆర్జీవీ, అరియానాల మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అయితే అరియానా మాత్రం పలు సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇప్పుడు అనుభవించు రాజా సినిమాతో అరియానా తన లక్‌ను పరీక్షించుకుంటోన్న సంగతి తెలిసిందే. అరియానాకు ఇది మొదటి సినిమా అవుతుంది. తాజాగా వదిలిన ఈ ట్రైలర్‌లో అరియానా మీద ఒక్క షాట్ మాత్రమే పడుతుంది. ఒకే ఒక్క చోట అరియానా కనిపిస్తుంది. కానీ అందరినీ కట్టిపడేసింది.
రాజ్ తరుణ్ చెప్పిన ఆ డైలాగ్.. అరియానా నడుముపై చేతిని వేసి ఒత్తిన విధానంతో ఆమె హైలెట్ అయింది. బంగారం గాడి లాంటి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తా ఉంటది.. పోతా ఉంటది.. ఏదీ పర్మనెంట్‌గా ఉండదు.. అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ అరియానా నడుమును ప్రెస్ చేసే విధానం ట్రైలర్‌లో హైలెట్ అయింది. అరియానా నడుముకు ఉన్న క్రేజ్‌తోనే ఇలాంటి సీన్ పెట్టి ఉంటాడు. ఏమైనా కానీ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేయడంలో రాజ్ తరుణ్ రూటే వేరు.