• August 14, 2022

LIGER Fandom Tour : ఏడుస్తుంది కానీ నాతో చెప్పదు.. విజయ్‌తో ఎక్కువ క్లోజ్ అయింది..చార్మీపై పూరి కామెంట్స్

LIGER Fandom Tour : ఏడుస్తుంది కానీ నాతో చెప్పదు.. విజయ్‌తో ఎక్కువ క్లోజ్ అయింది..చార్మీపై పూరి కామెంట్స్

    విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ సినిమా ఆగస్ట్ 25న రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్ ఫ్యాన్‌డం అనే ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈవెంట్లో అనన్య పాండే, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండలు అదిరిపోయే స్పీచులు ఇచ్చారు. అందులో మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ చాలా లెంగ్తీ స్పీచ్ ఇచ్చాడు. ఆయన ఏం మాట్లాడంటే..

    పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘వర్షం పడుతున్నా.. తడుచుకుంటూ వచ్చి నిలబడ్డ మీ అందరికీ లవ్యూ.. లైగర్ రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 25న రాబోతోంది. కరణ్ జోహర్‌కు థాంక్స్. కింగ్ ఆఫ్ బాలీవుడ్. రాజులా బతుకుతాడు. ఆయనే మాకు సపోర్ట్ చేశాడు.అపూర్వ మెహతా, ధర్మ టీం అందరికీ థాంక్స్. ఒకరోజు మా ఆవిడ నన్ను తిట్టింది.. ఎందుకు తిట్టిందంటే.. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు.. మంచి మంచి చిత్రాలు చేస్తున్నాడు.. నువ్వేమో ఇలా వెనకబడ్డావు.. కాస్త పక్క చిత్రాలు కూడా చూడు అని అంది. ఏ సినిమా చూడాలని అడిగాను. సందీప్ వంగా అనే కొత్త కుర్రాడుతీశాడు. సినిమా పేరు అర్జున్ రెడ్డి.. నేను నా కూతురు ఆల్రెడీ మూడుసార్లు చూశామని అంది. వెంటనే నేను కూడా సినిమా చూశాను. ఓ 45 నిమిషాలు చూసి ఆపేశా.. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. డైరెక్షన్ బాగుంది అంతా బాగుంది. కానీ నేను మాత్రం విజయ్ గురించి ఆలోచిస్తుండిపోయా. ఇంత జెన్యూన్‌గా, నిజాయితీగా నటిస్తున్నాడేంటి? అనుకున్నాను. అతనితో పని చేయాలని ఆరోజే డిసైడ్ చేయ్యాను. తెరపై యాక్టింగ్‌లోనే కాదు.. బయట కూడా నిజాయితీగా ఉంటాడు. ఎంత ఎలివేషన్ ఇచ్చినా కూడా అందులో ఎక్కువ కనిపించదు. అందులోనూ నిజాయితీ కనిపిస్తుంది. సినిమాల్లోనే హీరో కాదు.. బయట కూడా హీరోనే. నిర్మాతగా కోటి రూపాయలు ఇస్తే.. సినిమాకు ఖర్చు పెట్టండి తరువాత తీసుకుంటాను అని అంటాడు. రెండు కోట్లు పంపిస్తే.. మీకు అప్పులు ఉన్నాయ్ కదా ఫస్ట్ అవి కట్టండి అని అంటాడు. అలాంటి హీరో ఎక్కడ ఉంటారయ్యా.. ఆయన ఫాదర్ నాకు ఫ్రెండ్. నీ కొడుకు అనుకుని మంచి సినిమా తీయమని అన్నాడు. కానీ విజయ్ నన్ను తండ్రిలా చూసుకున్నాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. విజయ్, చార్మీలు ప్లాన్ చేస్తారు. అన్ని పనులు వాళ్లే చూసుకుంటారు. ఇలాంటి హీరోను నేను ఎప్పుడూ చూడలేదు. మళ్లీ దొరకదు. మైక్ టైసన్‌ను పట్టుకోవడానికి మాకు ఏడాది పట్టింది. దాని అంతటికి కారణం ఛార్మీనే. జూమ్ కాల్స్, లీగల్, ఫుల్ స్క్రిప్ట్ అంతా పంపించమని అంటాడు. మొత్తానికి లాస్ ఏంజిల్‌కు వెళ్లాం. అక్కడి క్రూని మాట్లాడుకున్నాం. అక్కడి వాళ్లకు మైక్ టైసన్ వస్తాడని చెబితే..ఎవ్వరూ నమ్మలేదు. మైక్ టైసన్ అసలు వస్తాడా? అని విజయ్ కూడా అలానే అడిగాడు. నాకు ఉచ్చ పడింది. అందరం అలా టెన్షన్‌లో ఉంటే.. అలా కారులోంచి దిగి మైక్ టైసన్ నడుచుకుంటూ వచ్చాడు. వాట్ ది .. అని అన్నాడు. హమ్మయ్య వచ్చాడని అనుకున్నాను. మైక్ టైసన్ గురించి ప్రపంచంలో ఏ మూలన అడిగిన చెబుతారు. అలాంటి వారితో పని చేశాం. మైక్ టైసన్ పక్కన కూర్చున్నామా? అని అనుకున్నాం. ఆయన చెప్పు నంబర్ కూడా 20. అలా ఎవరైనా ఉంటారా?.. అలాంటి మైక్ టైసన్‌తో పని చేసే చాన్స్ వచ్చింది. మేం చాలా లక్కీ. ఇందులో కేజ్‌తో ఫైట్ ఉండదు. బయట ఉంటుంది. అనన్య మా రాణి. అందగత్తే కాదు మంచి నటి. ఫైర్ బ్రాండ్. హీరోతో ఉండే సీన్స్ అన్ని చాలా ఇష్టం. ఆడాళ్లు మగాళ్ల మీద అరుస్తూ చేస్తే నాకు ఇష్టం. ఇది లవ్ స్టోరీ. దాన్ని మీరు చూడాలి. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లి. ఇలాంటి తల్లి ఉండాలని కోరుకుంటారు. నేను ఆవిడతో మొదటి సారి పని చేశాను. ఛార్మీ అయితే సినిమా కోసం మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతుంటుంది. నా వరకు ఏదీ రానివ్వదు. అన్నీ తనే చూసుకుంటుంది. ఏదైనా కొంపలు మునిగేది అయితే తప్పా రానివ్వదు. ప్రొడక్షన్‌లోనే కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడ్వడం కూడా నాకు చెప్పదు. ప్రొడ్యూసర్లకు అన్ని కష్టాలుంటాయ్. ఏ ప్రొడ్యూసర్ కూడా ఏడ్వకుండా సినిమాను తీయలేడు. ఏ కష్టం ఉన్నా నాకు చెప్పదు. విజయ్‌కి చెబుతుంది. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సినిమాకు అన్నీ తానై ఇక్కడి వరకు తీసుకొచ్చింది. లవ్యూ ఛార్మీ. విషు మా బలం. ఆయన రియల్ ఫైటర్. లైగర్ టీం కోసం పని చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నాడు.

    విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘సగం దేశం తిరిగి వచ్చిన తరువాత ఇక్కడకు వచ్చాం.. ఎక్కడకు వెళ్లినా కూడా ఇక్కడి వాళ్లు ఏం అనుకుంటున్నారు.. లైగర్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉండేవాడిని. ఈ రోజు ఇక్కడ పెద్ద ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. కానీ వర్షం వల్ల ఇలా చేస్తున్నాం. ఇండియా అంతా ఇప్పుడు ప్రేమ చూపిస్తోంది. కానీ ఇదంతా కూడా ఇక్కడే మొదలైంది. మీరు ఇచ్చిన ప్రేమను తిరిగి ఇస్తా. ఆగస్ట్ 25న ఫుల్లుగా తిరిగి ఇస్తాం. ఆగ్ లగా దేంగే అని ఇప్పుడు చెబుతున్నాం. సినిమా మీద ఏ డౌట్ లేదు.. బ్లాబ్లా బ్లాక్ బస్టర్. ఇండియాను మీరు షేక్ చేయాలి.. వరంగల్ మీరు షేక్ చేస్తారు.. తెలంగాణ, ఆంధ్రలో షేక్ చేయించి ఇండియా మొత్తం వినిపించాలి.. అమ్మ కొడుకు కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్తారు. కొడుకుని చాంపియన్ చేయాలని అమ్మ అనుకుంటుంది. నేను కూడా చిన్న పిల్లాడిని. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఆ పేరుకు తగినంతగా చేయలేదు.. చేయాలి.. నేను కూడా హైద్రాబాద్ నుంచి బాంబేకి వెళ్లాం.. పూరి మా నాన్నలా, ఛార్మీ మా అమ్మలా, మేం ముగ్గురం బయల్దేరాం.. ఇండియాను షేక్ చేద్దామని బాంబేకి వెళ్లాం. ఇంక ఏ ఇబ్బంది వచ్చినా ఎవ్వడు అడ్డు వచ్చినా వినలేదని ఫిక్స్ అయ్యాం. సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. పూరి రాసిన డైలాగ్ హీరోలు చెప్పాలంటే దేవుడి బ్లెస్సింగ్ ఉండాలి. ఇందులో ఓ డైలాగ్ ఉంది. దాంతో నేను ఎంతోకనెక్ట్ అయ్యాను. వీ ఆర్ ఇండియన్స్.. పోదాం.. కొట్లాడుదాం.. ఆగ్ హై అందర్.. దునియా ఆగ్ లగా దేంగే..వాట్ లగా దేంగే అంటూ డైలాగ్స్ చెప్పాడు. లైగర్ టీంకు పని చేసిన అందరికీ థాంక్స్. ఐ లవ్యూ ఆల్’ అని అన్నాడు.

    అనన్య మాట్లాడుతూ.. ‘మీరు అందరూ ఎలా ఉన్నారు.. నేను చాలా బాగున్నాను.. తెలుగు ఆడియెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరికీ నమస్కారం. హైద్రాబాద్‌లో నాకు ఎక్కువగా లవ్ దొరికింది. నేను దీన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. నేను ఇక్కడ ఓ భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను మీరు అంగీకరిస్తారా?.. లైగర్ టీంతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మై బుజ్జి కన్నా.. విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా ఆగస్ట్ 25న పగలిపోద్ది. ర్యాంప్ గ్యారంటీ.. ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా దింపుతున్నాం.. మజా వస్తుంది’ అని అంది.