• October 31, 2021

పునీత్ రాజ్ కుమార్ విషయంలో జరిగిందిదే.. బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్

పునీత్ రాజ్ కుమార్ విషయంలో జరిగిందిదే.. బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇంకా ఎవ్వరూ కోలుకోనేలేదు. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. కన్నడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాని చూసి చలించిపోయాడు. అంతటి గొప్ప వ్యక్తిగా ఎన్నో కోట్ల మంది హృదయాల్లో పునీత్ రాజ్ కుమార్ స్థానాన్ని సంపాదించుకున్నాడు.

    ఇదంతా కేవలం నటన వల్ల వచ్చిన అభిమానం అయితే కాదు. లెక్కలేనన్ని గుప్త దానాలు, సేవా కార్యక్రమాలు, ఆశ్రమాలు, విద్యార్థుల చదువు, పాఠశాలలు, గోశాలలు ఇలా లెక్కలేనన్ని మంచి పనులతో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా మరణించడంతో అందరూ షాక్ అవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ మొత్తానికి ఈ గుండెపోటు అనే సమస్య ఉంది. రాజ్ కుమార్ కూడా అలానే చనిపోయారు. శివ రాజ్ కుమార్ కూడా గుండె పోటుతో బాధపడ్డారు.

    అలా ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ కూడా కార్డియర్ అరెస్ట్‌తోనే చనిపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వ్యాయామం చేసి అల్పాహారం తీసుకున్నాక కాస్త అస్వస్థతకు గురయ్యారట పునీత్. తమ ఫ్యామిలీ డాక్టర్ రమణ రావు వద్దకు భార్యతో కలిసి పునీత్ వెళ్లాడట. జిమ్‌లోంచి రావడంతోనే చెమటలు పట్టాయి. అన్ని రకాల వ్యాయామాలు చేశాను.. బాక్సింగ్ కూడా చేశాను.. ఏదో ఇబ్బందిగా అనిపించిందన పునీత్ చెప్పాడట. ఈ మేరకు డాక్టర్ అన్ని రకాలు టెస్టులు చేయగా. ఈసీజీ తీస్తే అందులో ఏదో ప్రమాదంలా అనిపించిందట.

    వెంటనే విక్రమ్ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమని చెప్పాడట. విక్రం ఆస్పత్రికి ఫోన్ చేసి అంతా చెప్పేశాను అని డాక్టర్ అన్నాడు. అలా 11 గంటల 45 నిమిషాలకు పునీత్‌ను వీల్ చైర్‌లోనే విక్రమ్ ఆస్పత్రికి తీసుకెళ్లారట. కానీ అంతలోపే పునీత్ లోకాన్ని విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే విక్రమ్ హాస్పిటల్ డాక్టర్ రంగనాథ్ నాయక్ చెప్పిన వివరాల ప్రకారం.. విక్రమ్ హాస్పిటల్‌కు వచ్చే సమయానికే పునీత్ స్పృహలో లేరట. ఎంతగా ప్రయత్నించినా స్పృహలోకి రాకపోవడంతో రెండు గంటల ముప్పై నిమిషాలకు పునీత్ మరణించినట్టుగా ప్రకటించారు.

    Leave a Reply