• August 3, 2025

పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే – ఎస్‌కేఎన్ ఆవేదన

పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే – ఎస్‌కేఎన్ ఆవేదన

    సినిమా పరిశ్రమ కష్టకాలంలో ఉంది. అసలే చిత్రాలేవీ కూడా బ్లాక్ బస్టర్‌లు అవ్వడం లేదు. అంతో ఇంతో టాక్ వచ్చిన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదు. అందరూ ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. వంద సినిమాలు వస్తే.. ఓ రెండు చిత్రాలు ఓ మాదిరిగా ఆడేస్తున్నాయి. మిగిలిన సినిమాల సంగతి చెప్పాల్సిన పని లేదు. పైగా థియేటర్ల వ్యవస్థ రోజురోజుకీ దిగజారిపోతోంది. ఓటీటీ డీల్స్ కూడా ఇప్పుడు జరగడం లేదు.

    ఇవన్నీ ఇలా ఉంటే.. పైరసీ అనేది మరింతగా పెరిగిపోయింది. రిలీజ్ డే.. ఫస్ట్ డే ఫస్ట్ షో కాక ముందే పైరసీ వచ్చేస్తోంది.. వెరసీ సినిమా బతకడం కష్టంగా మారిపోయింది. ఇలాంటి టైంలో కార్మికులు, యూనియన్లు వెతనాల కోసం పోరాడుతున్నారు. వేతనాలు 30 శాతం పెంచకపోతే బంద్ అంటూ ప్రకటించేశారు. సినిమాలే ఆడటం లేదు.. డబ్బులు రావడం లేదని నిర్మాతలు నెత్తినోరు కొట్టుకుంటూ ఉంటే.. 30 శాతం వేతనాల్ని పెంచి ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.

    ఇలాంటి సమయంలో ఎస్‌కేఎన్ తన ఆవేదనను పంచుకున్నారు. ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం .. ఇప్పుడు అదనపు వేతనాల భారం .. ఓ టి టి శాటిలైట్స్ అగమ్య గోచరం.. పైరసీ పుండు మీద కారం .. పేరుకే వినోద పరిశ్రమ .. నిర్మాతల శ్రమ విషాదమే అని తమ పరిస్థితిని గురించి చెప్పుకున్నారు.