- December 3, 2024
‘వికటకవి’ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: రజినీ తాళ్లూరి
డిఫరెంట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఓటీటీ ZEE5. ఈ మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే. విడుదలైన కొన్ని గంటల్లోనే ీ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించటం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో…
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘‘‘వికటకవి’ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సిరీస్ అప్పుడే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రీచ్ కావటం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన జీ5 టీమ్‌కు థాంక్స్. అలాగే మా రైటర్ తేజగారికి, నా టీమ్‌కు థాంక్స్. వికటకవి సిరీస్‌ను డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మేకర్స్ అనుకున్న ఔట్‌పుట్‌ను ఎక్కడా తగ్గనీయకుండా అనుకున్న బడ్జెట్‌లో సిరీస్‌ను పూర్తి చేయటానికి అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమాటోగ్రాఫర్ షోయబ్, ఎడిటర్ సాయిబాబుగారు, కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి, ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్, వి.ఎఫ్.ఎక్స్ నాగుగారికి అందరికీ థాంక్స్’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ మాట్లాడుతూ ‘‘వికటకవి సిరీస్‌ను ఓ డిఫరెంట్‌గా రాసిన మా రైటర్ తేజ దీనికి తొలి హీరో. తను మూడేళ్లు ఈ కంటెంట్ కోసమే ఆలోచిస్తూ ఉండేవాడు. తను రాసినదాన్ని సిల్వర్ స్క్రీన్‌పై అలాగే తీసుకొచ్చి ప్రాణం పోసిన వ్యక్తి దర్శకుడు ప్రదీప్‌గారు. ప్రొడక్షన్ వేల్యూస్ అంటే ఎస్.ఆర్.టి అని మరోసారి వికటకవి ప్రూవ్ చేసింది. మేమేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చిన జీ5 యాజమాన్యానికి థాంక్స్’’ అన్నారు.
నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ ‘‘తేజ రాసిన కథ నచ్చడంతో జీ5 వంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది. సపోర్ట్ చేసిన యాజమాన్యానికి ీ సందర్భంగా స్పెషల్ థాంక్స్. ప్రదీప్ మద్దాలి.. చాలా ప్లానింగ్‌తో, కాన్ఫిడెంట్‌గా పూర్తి చేశారు. నరేష్ అగస్త్య డౌన్ టు ఎర్త్ పర్సన్. రఘు కుంచెగారు చక్కటి రోల్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘‘జీ5వారు నిర్మించిన పసుపు కుంకుమ సీరియల్‌తో నా కెరీర్ 2013లో స్టార్ట్ అయ్యింది. ఈ 11 ఏళ్ల ప్రయాణం మరచిపోలేను. అలాగే ఎస్ఆర్‌టి బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నటీనటులతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కూడా కుదిరడటంతో మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌ను ప్రేక్షకులకు అందించాం. ఇంత తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించటం చాలా ఆనందంగా ఉంది. వికటకవి సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ ‘‘‘వికటకవి’ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రీచ్ కావటం ఓ టీమ్ మెంబర్‌గా ఎంతో సంతోషాన్నిస్తోంది. పని చేసే అవకాశం ఇచ్చిన జీ5, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ వారికి, దర్శకుడు ప్రదీప్, రైటర్ తేజకు థాంక్స్. నరేష్ అగస్త్య టైటిల్ పాత్రను పోషించిన తీరు చక్కగా ఉంది. తనకు మాత్రమే సూట్ అయ్యే క్యారెక్టర్ అనేంత బాగా పాత్రలో ఒదిగిపోయారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
రైటర్ తేజ దేశ్‌రాజ్ మాట్లాడుతూ ‘‘తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ రాసిన తొలి రైటర్ ఎవరంటే .. నేనే రాశానని గర్వంగా చెప్పుకునేలా వికటకవి సిరీస్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్‌లన్నింటిలోనే వికటకవి టాప్ ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ వీక్ రికార్డ్స్‌ను ఇది క్రాస్ చేసేసింది. ఇంత మంచి సిరీస్ చేయటానికి కారణం.. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. ఈ సందర్భంగా వారికి స్పెషల్ థాంక్స్. మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందించారు. నటీనటులు, టెక్నీషియన్స్‌కు, అనూరాధ గారికి థాంక్స్. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి అనుకున్న బడ్జెట్‌లో మేం అనుకున్న దానికంటే బెస్ట్ సిరీస్‌ను ఇచ్చారు. దీనికి సీక్వెల్‌ను చేస్తాం. జీ5లో ఇది బిగెస్ట్ హిట్ సిరీస్’’ అన్నారు.
రఘు కుంచె మాట్లాడుతూ ‘‘వికటకవి వెబ్ సిరీస్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దీన్ని రూపొందించిన జీ5, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్‌కు థాంక్స్. రైటర్ తేజ గొప్ప కథను అందించారు. ఈ కథను అంతే గొప్పగా తెరకెక్కించారు మా డైరెక్టర్ ప్రదీప్‌గారు. అలాగే ప్రతీ సన్నివేశాన్ని గొప్పగా చూపించిన మా సినిమాటోగ్రాఫర్ షోయబ్‌గారికి, సన్నివేశాలకు తగ్గట్టు మంచి సంగీతాన్నందించిన అజయ్ అరసాడగారు.. ఇలా ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆదరిస్తోన్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.
వికటకవి సిరీస్ సక్సెస్‌ను చిత్ర యూనిట్ కేక్ కటింగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది.