• December 25, 2022

విజన్ సినిమాస్ కార్యాలయంలో నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి బర్త్ డే వేడుకలు

విజన్ సినిమాస్ కార్యాలయంలో నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి బర్త్ డే వేడుకలు

    ఓ సినిమా నిర్మాణం కావాలన్నా.. ఓ మంచి చిత్రం బయటకు రావాలన్నా.. ఇండస్ట్రీ బాగుండాలన్నా కూడా మంచి అభిరుచి కలిగిన నిర్మాతలు కావాలి. అలాంటి ఓ నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాగం తిరుపతి రెడ్డి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది తీస్ మార్ ఖాన్ అంటూ ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు. నేడు (డిసెంబర్ 25) ఆయన పుట్టిన రోజు. విజన్ సినిమాస్ కార్యాలయంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈక్రమంలో ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు.

    నాగం తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా బ్యానర్‌లో ఇది వరకు వచ్చిన నాలుగు చిత్రాలకు మీడియా నుంచి మంచి సహాకారం అందింది. ప్రేక్షకులు సైతం మా చిత్రాలను ఆదరించారు. వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు రాబోతున్నాయి. అవి ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాము. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తామ’ని అన్నారు.

    విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి తీస్ మార్ ఖాన్ సినిమాను ఎంతో ఉన్నతంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి కమర్షియల్ విజయం సాధించడం నిర్మాతలో మరింత ఉత్సాహం నింపినట్టు అయింది. ఇప్పుడు ఆయన మరిన్ని ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మున్ముందు అన్ని రకాల జానర్లలో భారీ సినిమాలను నిర్మిస్తున్నట్టుగా నాగం తిరుపతి రెడ్డి తెలిపారు.