• November 23, 2023

 ప్రియమణి భామా కలాపం 2 ఫస్ట్ లుక్ 

 ప్రియమణి భామా కలాపం 2 ఫస్ట్ లుక్ 

    ఇండియాలో నెంబర్ వన్ లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే ఉంది. ఈ కోవలో విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ మూవీ ఆహాలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ను త్వరలోనే మన ముందుకు తీసుకు వస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ ఫ్రాంచైజీ రూపొందుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇదొక మంచి విందులా ప్రేక్షకులను ఆకట్టుకుకునేలా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘భామా కలాపం 2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఇది ఆడియెన్స్‌ను అలరించనుందని అర్థమవుతుంది.

    ఇంతకు ముందుకు ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లతో రెండు వరుస సక్సెస్‌లను సొంతం చేసుకున్న డ్రీమ్ ఫార్మర్స్ ఇప్పుడు ‘భామా కలాపం 2’తో మరో చక్కటి సినిమాను అందించనున్నారు. త్వరలోనే ఇది థియేటర్స్‌లో విడుదల కావటానికి సిద్ధమవుతోంది.

    డ్రీమ్ ఫార్మర్స్‌తొో పాటు ఆహా స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తోన్న ‘భామా కలాపం 2’లో మంచి పెర్ఫామెన్స్ చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులున్నారు. దీంతో మూవీపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తోంది. శీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.