- December 22, 2023
ప్రభాస్ సలార్ ట్విట్టర్ రివ్యూ.. అది కనుక ఎక్కేస్తే వెయ్యి కోట్లు పక్కా
Prabhas Salaar Twitter Review ప్రభాస్ సలార్ సినిమా థియేటర్లోకి వచ్చింది. డిసెంబర్ 22న తెల్లవారు ఝాము కాక ముందే బ్లాక్ బస్టర్ రిపోర్టులు వచ్చాయి. అర్దరాత్రి దాటిన తరువాతే షోలు స్టార్ట్ అయ్యాయి. ఒంటి గంట నుంచి కంటిన్యూగా షోలు పడుతూనే వచ్చాయి. ఉదయం నాలుగు గంటలు, ఐదు గంటల షోల నుంచి కూడా రిపోర్టులు వస్తున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే మాట తప్పా ఇంకోటి వినిపించడం లేదు. కనిపించడం లేదు.
ఇక ఈ చిత్రం ఫ్యాన్స్‌కు మాత్రం పండుగే అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉందని, అసలు ఆ ఫైట్స్ ఏంటి బాబు అని షాక్ అవుతున్నారు. సెకండాఫ్ కొంత గందరగోళంగా ఉంటుందని, రెండో పార్ట్ కోసం బేస్ రెడీ చేసుకున్నాడని, అది కనుక అందరికీ అర్థం అయితే.. ఎక్కేస్తే వెయ్యి కోట్లు పక్కా అని అంటున్నారు.
సాహో, సలార్ ప్లాట్ సేమ్ అని కొందరు అంటున్నారు. అయితే మనం పెట్టే డబ్బులకు ఒక్క ఇంటర్వెల్ సరిపోతుందని, అది చాలు అని మిగతాది అంతా కూడా బోనస్సే అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ అయిందని, ఇంట్రో బ్లాక్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే అంతా కన్ఫ్యూజన్‌గానే ఉందని, సెకండాఫ్‌లో అన్నీ రివీల్ అయ్యేట్టుగా ఉన్నాయని అంటున్నారు.
చాలా రోజుల తరువాత ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందని, అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా,లేజీగా సాగుతూ వచ్చిందని, సెకండాఫ్ టెర్రిఫిక్‌గా ఉందని అంటున్నారు. ఫ్యాన్స్‌కు నిజంగానే పండుగలా ఉంటుందట. రవి బస్రూర్ సంగీతం, నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందట. అయితే కేజీయఫ్‌ను మాత్రం మ్యాచ్ చేయలేకపోయారని చెబుతున్నారు.