- October 19, 2021
పచ్చి పచ్చిగా రొమాంటిక్ ట్రైలర్.. కేతిక శర్మ బ్యాక్ మీద కన్నేసిన ఆకాష్

పూరి జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయి.. అందులో డైలాగ్స్ ఎలా ఉంటాయి.. రొమాన్స్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరీ పచ్చి పచ్చిగా రాసేసినట్టున్నారు. హీరోయిన్ బ్యాక్ మీదే డైలాగ్ రాసి.. కెమెరా యాంగిల్ కూడా పై ఎత్తులు, కింది ఎత్తుల మీద బాగానే పెట్టించినట్టు కనిపిస్తోంది. అసలే కేతిక శర్మ భారీ అందాలకు యూత్ ఎప్పుడో పడిపోయింది. అందుకు ప్రతీ పోస్టర్‌లో ఎద అందాలు, బ్యాక్ అందాలను చూపిస్తూ యూత్‌కు పిచ్చెక్కించారు.
తాజాగా ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో ఆకాష్ పూరి, కేతిక శర్మలు రెచ్చిపోయారు. ఐ లక్ దిస్ యానిమల్ అంటూ కసి కసిగా ఆకాష్ పూరి డైలాగ్ చెప్పడం.. వాట్ డూ యు వాంట్ అని కొంటెగా కేతిక శర్మ అడగడంతో కథ ఏంటో తెలిసిపోతోంది. ఇక నీ బ్యాక్ నువ్ ఎప్పుడైనా చూసుకున్నావా? మతి పోతోంది అంటూ పూరికి మాత్రమే చెల్లేలా దారుణంగా రాసేశాడు. ఇక కేతిక శర్మను పట్టుకోవడం హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం తప్పా ఇంకేం లేకుండా పోయింది ట్రైలర్.
ఎంతో మంది మోహానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటారట.. కానీ వీరి మాత్రం ప్రేమలో ఉండి మోహాం అని పేరు పెట్టుకున్నారట.. ఈ విషయాన్ని లేడీ పోలీస్ ఆఫీసర్ అయిన రమ్యకృష్ణ కనిపెడుతోంది. వారిద్దరూ ప్రేమలో లేకపోయినా అలా చేసుకోవడం ఏంటి? ఈ ఇద్దరి చుట్టూ పోలీసులు తిరగడం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే రొమాంటిక్ సినిమా. మొత్తానికి పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. నవంబర్ 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది.