Trivikram: త్రివిక్రమ్ బర్త్ డే.. పూనమ్ కౌర్ వెరైటీ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించిందో మరి!

Trivikram: త్రివిక్రమ్ బర్త్ డే.. పూనమ్ కౌర్ వెరైటీ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించిందో మరి!

    Trivikram త్రివిక్రమ్ పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ కత్తి మహేష్ ఇలా కొన్ని పేర్లు మార్మోగిపోయాయి. రెండు మూడేళ్ల క్రితం కత్తి మహేష్ లేవనెత్తిన అంశాలతో పూనమ్ కౌర్ వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్‌తో అక్రమ సంబంధం ఉందంటూ కొన్ని రూమర్లు వచ్చాయి. కత్తి మహేష్ ఈ విషయం మీద చాలానే ఆరోపణలు చేశాడు. కత్తి మహేష్ మరణించిన రోజున కూడా పూనమ్ కౌర్ వెరైటీ ట్వీట్ వేసింది.

    ఇక మొన్నటికి మొన్న పోసానీ కృష్ణ మురళీ.. ఓ పంజాబీ అమ్మాయి, నటి అంటూ ఆమెను ఎవరో మోసం చేశారట అని ఆరోపణలు చేశాడు. దీంతో మళ్లీ పూనమ్ కౌర్ ఇష్యూ తెర మీదకు వచ్చింది. అయితే పూనమ్ కౌర్ మాత్రం ఎప్పుడూ కూడా వేటి మీద కూడా నేరుగా స్పందించింది లేదు. అర్థం పర్థం లేదని ట్వీట్లు, నిగూఢ అర్థం ఇచ్చేలా ట్వీట్లు వేస్తుంది. వాటిని డిలీట్ చేస్తూ ఉంటుంది.

    అలాంటి పూనమ్ కౌర్ త్రివిక్రమ్ అంటే మాత్రం కాస్త చిరగ్గానే స్పందిస్తుంది. గురూజీ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటుంది. కానీ ఎప్పుడూ కూడా త్రివిక్రమ్ పేరును వాడలేదు. అలా పూనమ్ కౌర్ వేసే ట్వీట్లు ఎవ్వరికీ అంత ఈజీగా అర్థం కావు. నిన్న అంటే నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే. ఈ సందర్భంగా గురు అంటే అర్థం ఏంటో పూనమ్ కౌర్ వివరించింది.

    గురు.. గు అంటే అంధకారం.. రు.. అంటే తొలగించడం.. ఆ అంధకారాన్ని తొలగించడం ఎలా? మనం అంధకారాన్ని తన్ని తరిమేయలేం.. వెలుగు లేకపోవడంతోనే అంధకారం ఏర్పడుతుంది అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

    Leave a Reply