• December 5, 2021

Payal Rajput: వాటిని ఎప్పుడూ చూడలేదా?.. ట్రోలింగ్‌పై పాయల్ సెటైర్లు

Payal Rajput: వాటిని ఎప్పుడూ చూడలేదా?.. ట్రోలింగ్‌పై పాయల్ సెటైర్లు

    Payal Rajput పాయల్ రాజ్‌పుత్ మీద నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమె ఏం చేసినా కూడా కొందరు నెటిజన్లు రెడీగా ఉంటారు. ఆమె మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడుతుంటారు. అయితే తాజాగా ఆమె ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. అందులో తన ప్రైవేట్ పార్ట్ కనిపించింది. దీంతో ఆ వీడియోను వెంటనే డిలీట్ చేసి మరో కొత్త వీడియోను షేర్ చేసింది.

    కానీ అంతలోపే ఆ వీడియోలు, ఆ ప్రైవేట్ పార్ట్‌ కనిపించే స్క్రీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో పాయల్‌ను నెటిజన్లు దారుణమైన కామెంట్లతో ఆడుకున్నారు. అలా తన మీద వచ్చిన ట్రోలింగ్‌పై పాయల్ తాజాగా కౌంటర్లు వేసింది. నా ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా భయం వేస్తోంది. నా మీద చెత్త చెత్త కామెంట్లన్నీ చేస్తున్నారు. నేను సున్నితమైన దాన్ని, ఎమోషనల్ పర్సన్‌ని.

    వారు చేసే ట్రోలింగ్ నా మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంటాయి. మీమ్ పేజీలు, నెటిజన్లు చేసే ట్రోలింగ్ నన్ను ఎంతో బాధపెడుతున్నాయి. ఇది కేవలం నన్ను మాత్రమే కాదు.. నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మా అమ్మ అయితే ఇవన్నీ మనకు వద్దు.. అంతా సర్దుకుని వచ్చేసేయ్ అని చెప్పింది.

    ఇవన్నీ నేను తట్టుకోగలను హ్యాండిల్ చేయగలను అని వారికి ధైర్యం చెప్పాను. ఇలాంటి చెత్త ట్రోలింగ్, కామెంట్లతో నా కెరీర్‌ను వదులుకోలేను. అయితే అది జస్ట్ నిప్ స్లిప్. కానీ అదేదో పెద్ద తప్పైనట్టు చూస్తున్నారు. అదే పెద్ద స్కాండల్ అయినట్టు చూడటం మానేయాలి. ఇది వరకు జీవితంలో ఎన్నడూ కూడా బ్రెస్ట్, నిప్పల్స్‌ను చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు.

    సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లను చూశాక నేను ఆశ్చర్యపోయాను. ఆడవాళ్లకు ఎవ్వరికీ లేనివి నాకే ఉన్నాయా? అని అశ్చర్యపోయాను’ అంటూ పాయల్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. మరి ట్రోలర్స్ ఇంతటితోనైనా పాయల్‌ను వదిలేస్తారో లేదో చూడాలి.

    Leave a Reply