• July 30, 2025

పాయల్ రాజ్‌పుత్‌కు పితృ వియోగం

పాయల్ రాజ్‌పుత్‌కు పితృ వియోగం

    ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. పాయల్ తండ్రి విమల్ కుమార్ (67) కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం (జూలై 28) కన్నుమూశారు. ఆ విషయాన్ని తాజాగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. తండ్రి మరణాన్ని దిగమింగుకుని పాయల్ వేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. భౌతికంగా దూరమైనా కూడా నువ్వు నాతోనే ఉంటావ్ నాన్నా.. నా మనసులో ఎప్పటికీ ఉంటావ్ అంటూ పోస్ట్ వేశారు. ఇక క్యాన్సర్ మీద మన శక్తికి మించి పోరాడామని, అయినా ఓడిపోయామని, క్షమించు నాన్నా అంటూ పాయల్ ఎమోషనల్ అయ్యారు.