- February 7, 2022
Pawan Kalyan: నా బలహీనత అదే : పవన్ కళ్యాణ్

Pawan Kalyan పవన్ కళ్యాణ్ గురించి నిన్నంతా లెక్కలేనన్ని వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇరవై ఏళ్ల క్రితం నాటి అభిప్రాయాలు అంటూ పవన్ కళ్యాణ్ తన చేతిరాతతో ఉన్న ఓ పత్రం వైరల్ కాసాగింది. ఇందులో ఎన్నో విషయాలను పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఇరవై ఏళ్ల క్రితం నాటి అభిప్రాయాలు కావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇందులో అనేక విషయాలు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ప్రకృతిని అమితంగా ప్రేమిస్తానని, నమ్ముకున్న వాటి కోసం నిలబడటమే ఎదుటివారిలో ఇష్టమని, మా అన్నయ్య నాకు రివాల్వర్ కొనిచ్చిన రోజును మరిచిపోలేని ఘటన అని ఇలా పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలను చెప్పేశాడు. ఇందులోనే తన బలహీనత ఏంటో కూడా చెప్పేశాడు.
ఫ్రెంచ్ రెడ్ వైన్ అనేది తన బలహీనత అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. పది మంది మధ్యలో మాట్లాడమన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది.. రేప్‌కి గురైన స్త్రీ గురించి చదివినప్పుడు నా మనసుకు బాధ వేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఇలా తన ఇష్టాయిష్టాలు రాసుకుంటూ వెళ్లాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి అనేక విషయాలు ఇలా తెలుస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఈ నెలలోనే హరిహర వీరమల్లు షూటింగ్‌ను ప్రారంభించే పనిలో పడ్డారు. ఈ సినిమా తరువాత మైత్రీ మూవీస్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టబోతోన్నాడు. అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లను రెడీ చేసేశాడు.