• July 12, 2025

ఓజీ షూట్ పూర్తి.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్

ఓజీ షూట్ పూర్తి.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ‘ఓజీ’ (OG) చిత్రం షూటింగ్ పూర్తయిందని మేకర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ట్వీట్ వేసింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.

    చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా, నిర్మాతలు విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వర్షంలో తడుస్తూ, కారు దిగి గన్‌తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

    ‘ఆర్ఆర్ఆర్’ వంటి అంతర్జాతీయ విజయాన్ని అందించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌లలో ఒకటిగా ‘ఓజీ’ నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ‘ఓజీ’ కూడా అన్ని రికార్డులను తిరగరాసేలా రూపొందుతోందని, యాక్షన్ ప్రియులతో పాటు మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంటుందని అంతా భావిస్తున్నారు.