• July 30, 2025

హీరో, డైరెక్టర్ నన్ను ట్రై చేస్తారు : నిత్యా మీనన్

హీరో, డైరెక్టర్ నన్ను ట్రై చేస్తారు : నిత్యా మీనన్

    నిత్యా మీనన్ ఆర్టిస్టుగా జాతీయ స్థాయిలో అవార్డుల్ని సాధించారు. ఆమె చాలా సెలెక్టివ్‌గా కథల్ని, సినిమాల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ ఉంటారు. సార్ మేడం అంటూ విజయ్ సేతుపతితో నిత్యా మీనన్ ఆగస్ట్ 1న ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తెలుగులో మీడియాతో ముచ్చటించారు. ఈక్రమంలో నిత్యా మీనన్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

    హీరో, డైరెక్టర్ నన్ను ట్రై చేస్తారు అని నిత్యా మీనన్ అంటోంది.. సరిగ్గా చెప్పండి అని విజయ్ సేతుపతి ఆమెను కరెక్ట్ చేస్తాడు. ఓ సారీ.. పెళ్లి చేసుకోమని, పెళ్లికి సంబంధించి నన్ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తారు అని చెబుతున్నా అంటూ నిత్యా మీనన్ నవ్వేసింది. ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన ఈ ట్రై చేస్తారు కామెంట్ మాత్రం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.