• October 29, 2021

HBD Naga Babu : నా నవ్వు కోసం ఏమైనా చేస్తాడు.. నిహారిక ఎమోషనల్

HBD Naga Babu : నా నవ్వు కోసం ఏమైనా చేస్తాడు.. నిహారిక ఎమోషనల్

    మెగా డాటర్ నిహారిక, మెగా బ్రదర్ నాగబాబు మధ్య ఉన్న తండ్రీ కూతుళ్ల బంధానికి ఎంతో మంది అభిమానులున్నారు. వారిద్దరూ తండ్రీకూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా కలిసి ఉంటారు. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా కూడా ఒకేలా ఉంటారు. నాగబాబు దగ్గర ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది కూడా నిహారిక. అలా ఈ తండ్రీకూతుళ్ల విశేషాలు చెప్పాలంటే రోజంతా సరిపోదు. నేడు (అక్టోబర్ 29) నాగబాబు బర్త్ డే. ఈ క్రమంలో నిహారిక విషెస్ చెబుతూ ఎమోషనల్ అయింది.

    తండ్రికి బర్త్ డే విషెస్ చెబుతూ. ఓ సంఘటనను వివరించింది. ‘ఈ ఫోటో తీసేకంటే ముందు రోజు ఏం జరిగిందంటే.. నేను ఏదో మూడ్‌లో ఉన్నాను.. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. కానీ తెల్లారే షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. చిరాగ్గానే షూటింగ్‌కు వెళ్లాను. ఓ గంట తరువాత మా నాన్న షూటింగ్ స్పాట్‌కు వచ్చాడు. మా ఇంటి నుంచి పది హేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెప్పా పెట్టకుండా వచ్చేశాడు.

    ఎందుకు వచ్చావ్ అని నేను అడిగాను. దానికి ఆయన ఇలా ఆన్సర్ ఇచ్చాడు. నువ్ ఎప్పుడైతే నవ్వుతావో. బాగున్నావ్ అని అనిపిస్తుందో అప్పుడు వెళ్తాను అని అన్నాడు. అలా ఓ గంట తరువాత పిజ్జా తిన్నాను. ఆయనకు ఓ ముద్దు పెట్టాను.. నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. ఆయనతో ప్రతీ రోజూ ప్రేమలో పడిపోతూనే ఉంటాను. కానీ ఆరోజు మాత్రం ఇంకా ఎందుకో వెరైటీగా అనిపించింది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు.. ఒక్క మా వరుణ్ అన్నకు తప్ప. నా నవ్వుకోసం ఆయన ఏమైనా చేస్తారు అని నాకు తెలుసు. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా నవ్వు ఆయన్ను సంతోష పెడుతుందంటే నాకు మరింత ఆనందంగా ఉంటుంది. హ్యాపీ బర్త్ డే డాడు’ అని నిహారిక ఎమోషనల్ అయింది.

    Leave a Reply