- November 26, 2021
Niharika Konidela : అందుకే దూరంగా ఉంటున్నారట.. వేరు కాపురంపై నోరు విప్పిన నిహారిక
Niharika మెగా డాటర్ నిహారిక ఇప్పుడు మెగా కాంపౌండ్‌కు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. పెళ్లైన తరువాత నిహారిక.. మెగా ఫ్యామిలీకి దూరంగానే బతుకుతోంది. పండుగల, పబ్బాలుంటేనే కలుస్తోంది. ఇక భర్తతో కలిసి వెకేషన్లు, సినిమా షూటింగ్‌లంటూ బిజీగా గడిపేస్తోంది. పెళ్లి తరువాత కొన్ని రోజులు మాత్రమే నిహారిక అత్తింట్లో ఉంది. ఆ తరువాత వేరే కాపురం పెట్టేశారు.
ఆ మధ్య నిహారిక, చైతన్యలు ఉంటున్న అపార్ట్మెంట్ల ఇష్యూ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. అయితే వాటిని చైతన్య క్లారిటీ ఇచ్చాడు. మిస్ అండర్ స్టాండింగ్ వల్లే అలా జరిగిందని, ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చెప్పినా కూడా వినలేదని, అందుకే కంప్లైంట్ ఇచ్చామని చైతన్య వివరించాడు.
అలా మొత్తానికి ఆ వివాదానికి పుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా నిహారిక కొన్ని విషయాలను పంచుకుంది. తాను ఎందుకు సపరేట్గా ఉంటున్నానో చెప్పేసింది. భర్తతో కలిసి వేరు కాపురం పెట్టడానికి గల కారణాలను బయటపెట్టేసింది.
చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ బయట పెరిగింది లేదు.. బయట ఉన్నది లేదు.. కనీసం హాస్టల్లో ఉండి కూడా చదువు కోలేదు.. ఇప్పుడు పెళ్లి అయింది కదా. కనీసం ఇప్పుడైనా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తామని చెప్పి.. వేరుగా ఉంటున్నారట. మొత్తానికి మళ్లీ అంతా కలిసి ఒకే చోటకు రాబోతోన్నారన్న మాట. నిహారిక ఇప్పుడు తన భర్తతో కలిసి విదేశాల్లో విహారిస్తోంది. స్పెయిన్, బార్సిలోనా అంటూ తిరుగుతోంది.