Niharika Divorce : ఎట్టకేలకు నోరు విప్పన నిహారిక.. విడాకులపై ఇద్దరిదీ ఒకే మాట

Niharika Divorce : ఎట్టకేలకు నోరు విప్పన నిహారిక.. విడాకులపై ఇద్దరిదీ ఒకే మాట

    Niharika Divorce: మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎట్టకేలకు తన విడాకుల గురించి నోరు విప్పారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే నిజం అయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ, నిహారికలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి వచ్చిన పత్రాలు, వీరిద్దరి విడాకుల వ్యవహారం నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు నిహారిక, చైతన్యలు తమ విడాకుల విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.

    ఇన్ని రోజులు నిహారిక, చైతన్యలు తమ విడాకుల గురించి ఎక్కడా నోరు విప్పలేదు. కోర్టు నుంచి తీర్పు రాకపోవడంతోనే అలా సైలెంట్‌గా ఉన్నారని అర్థం అవుతోంది. ఇప్పుడు వీరికి కోర్ఠు అధికారికంగా విడాకులు ప్రకటించేసింది. అందుకే నిహారిక, చైతన్యలు తమ విడాకుల గురించి ఓ స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

    తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని, మా ఈ ఉమ్మడి నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తూ, మా ప్రైవసీని గుర్తించి మాకు సహకరిస్తారని భావిస్తున్నాం.. మాకు అండగా నిలిచిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లకు థాంక్స్.. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అందరికీ థాంక్స్ అని చైతన్య, నిహారికలు ఒకే రకమైన ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు.

    ఇక నిహారిక అయితే తన ఇన్ స్టా పోస్ట్‌కు కామెంట్ల సెక్షన్‌ను క్లోజ్ చేసింది. నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తాయని ముందుగానే ఊహించి ఇలా కామెంట్ సెక్షన్‌ను డిజబుల్ చేసింది. అటు చైతన్య కూడా అదే పని చేశాడు. ఇలా ఉమ్మడిగా ఒకే రకమైన ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేయడంతో సమంత, నాగ చైతన్యలను గుర్తు చేసినట్టుగా అనిపిస్తోంది.

    నాగ చైతన్య, సమంతలు విడిపోయిన సమయంలో, విడాకులు ప్రకటించిన సమయంలోనూ ఇలానే ఉమ్మడిగా ఒకే రకమైన సందేశాన్ని షేర్ చేశారు. ఇక నిహారిక ఇప్పుడు తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వెబ్ సిరీసుల్లో నటిస్తూ, నిర్మిస్తూ తన లోకంలో తాను ఉంటున్నారు నిహారిక. ఇన్ని రోజులకు నిహారిక విడాకుల రూమర్లు, కథనాలకు చెక్ పెట్టినట్టు అయింది.