- October 19, 2021
గుళ్లుగోపురాలకు తిరుగుతున్న నయన్ విఘ్నేష్.. పెళ్లి ఘడియలు దగ్గర పడ్డట్టేనా?

లేడీ సూపర్ స్టార్ నయనతార తెరపై ఎన్ని సక్సెస్‌లు సాధించినా కూడా పర్సనల్ లైఫ్ మాత్రం ఇంకా గాడిన పెట్టుకోలేకపోతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో ఎదురుదెబ్బలు తిని ఉంది. శింబు, ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం కొనసాగిచింది. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. కానీ అక్కడే ట్విస్ట్ జరిగింది. ప్రభుదేవాతో పెళ్లి ఫిక్స్ అయింది. చివరి క్షణంలో రద్దు చేసుకుంది. నయన్ కోసం ప్రభుదేవా తన భార్యను కూడా వదిలేశాడు. అలా చివరకు నయన్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రభుదేవా అటూ ఇటూ కాకుండా అయిపోయాడు.
అలా కొన్ని రోజుల తరువాత మళ్లీ నయనతార జీవితంలోకి డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఎంట్రీ ఇచ్చాడు. నానూ రౌడీదానే సినిమాతో నయన్‌ను ప్రేమలోకి దింపేశాడు. సినిమా హిట్ అయింది.. అలా వీరిద్దరి లవ్ స్టోరీ కూడా సెట్ అయింది. అయితే ప్రేమలో పీకల్లోతు మునిగి ఉన్న ఈ జోడి పెళ్లికి మాత్రం అడుగులు వేయడం లేదు. ఇప్పటికే వీరిద్దరి వ్యవహారం మీద లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. విడిపోయారంటూ మధ్యలో కొన్ని కథనాలు వచ్చాయి. కలిసే ఉన్నామని పరోక్షంగా చెబుతూ ఆ రూమర్లను ఖండించారు.
అయితే పెళ్లి విషయంలో మాత్రం ఈ ఇద్దరూ నోరు విప్పడం లేదు. కానీ చెట్టాపట్టాలేసుకుని ప్రపంచాన్ని చుట్టేస్తుంటారు. మధ్యమధ్యలో గుళ్లు గోపురాలు కూడా తిరిగేస్తుంటారు. తాజాగా నయన్, విఘ్నేశ్ శివన్ మహారాష్ట్రలో దైవ దర్శనాల్లో బిజీగా ఉన్నారు. షిర్డీ సాయినాథుని సన్నిధిలో కనిపించారు. అక్కడే చుట్టు పక్కల ఉన్న గుళ్లుగోపురాలకు కూడా తిరిగారు. అయితే ఇప్పుడు ఇలా సడెన్‌గా ఎందుకు దైవ దర్శనాలు చేస్తున్నారా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. తాళి కట్టించుకునే ముందు ఇలా ఏమైనా మొక్కుబడులు వంటివి ఏమైనా మొక్కుకున్నారా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.