• October 28, 2023

యాంకర్‌కి గట్టిగా ఇచ్చిన రక్షిత్ అట్లూరి

యాంకర్‌కి గట్టిగా ఇచ్చిన రక్షిత్ అట్లూరి

    మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, యాంకర్లు ఈ మధ్య సెలెబ్రిటీలతో కాస్త పరాచకాలు ఆడుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇలానే ఓ ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ యూబ్యూబ్ యాంకర్ కాస్త హర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు. పదే పదే మూడ్ బాగుందా? అని అడుగుతూ ఇబ్బందిపెట్టాడు. ఇక ఇంటర్వ్యూ మొదలుపెట్టకుండానే హెబ్బా పటేల్ లేచి వెళ్లిపోయింది.

    అయితే ఇప్పుడు అదే యాంకర్‌కు హీరో రక్షిత్ అట్లూరి కౌంటర్ వేశాడు. రక్షిత్ హీరోగా నటించిన నరకాసుర వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో భాగంగానే సదరు యాంకర్‌కు కౌంటర్ వేశాడు. మీ మూడ్ బాగుందా? ప్రశ్నలు వేసేందుకు రెడీగా ఉన్నారా? మీ మూడ్ బాగుంటేనే కదా? ఇంటర్వ్యూ చేసేది అంటూ ఇలా రోస్ట్ చేశాడు. దీంతో ఆ యాంకర్ దెబ్బకు దండం పెట్టేశాడు.

    సెలెబ్రిటీలను ఇలా ఆడుకునే యాంకర్లకు.. ఇలాంటి హీరోనే కరెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు. హీరో, హీరోయిన్లను ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు వారు పడే బాధ తెలియదు.. వారికి కూడా అలాంటి ఘటనే ఎదురైతే తెలుస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రక్షిత్ చేసిన పనికి నెటిజన్ల నుంచి మాత్రం మంచి స్పందన వస్తోంది.

    రక్షిత్ అట్లూరి పలాస సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు శశి వదనే అంటూ ఓ కూల్ విలేజ్ లవ్ స్టోరీతో రాబోతోన్నాడు. నరకాసుర తరువాత శశివదనే అంటూ వెంటనే రక్షిత్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.