• February 14, 2025

ఇది తండ్రి కొడుకుల ప్రేమికుల రోజు– నేచురల్‌ స్టార్‌ నాని

ఇది తండ్రి కొడుకుల ప్రేమికుల రోజు– నేచురల్‌ స్టార్‌ నాని

    స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై ప్రభాకర్‌ అరిపాక సమర్పణలో పృద్వీ పోలవరపు నిర్మాతగా సముద్రఖని ప్రధానపాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. ఆ ఈ మూవీ ట్రైలర్‌ను నాని రిలీజ్ చేశారు. ధన్ రాజ్ కోసం ముందుకు వచ్చిన నాని ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ– ‘‘ రామం రాఘవం’’ ట్రైలర్‌ను నా చేతులమీదుగా విడుదల చేయటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ధన్‌రాజ్‌ నాకు కెరీర్‌ మొదట్నుండి పరిచయం. అప్పుడే అతని టాలెంట్‌ రేంజ్‌ ఏంటో నాకు తెలుసు. అందుకే ‘రామం రాఘవం’ సినిమాని ధన్‌రాజ్‌ దర్శకత్వం వహించాడంటే నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ధన్‌రాజ్‌ కామెడి సినిమా తీస్తాడేమో అనుకున్న నన్ను ట్రైలర్‌ చూపించి ఎమోషనల్‌ డ్రైవ్‌లోకి తీసుకెళ్లాడు. సముద్రఖని అన్న వర్క్‌ అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టం. ఆయన నేను ఫ్యామిలీలా ఉంటాము. నిర్మాత పృధ్వీ పోలవరపు మంచి కంటెంట్‌ ఉన్న సినిమాని నిర్మించటం మంచి విషయం. ‘శశి’ సినిమాలో ‘‘ ఒకే ఒక లోకం నువ్వు….. ’’ పాట నాకు ఎంతో ఇష్టం. ఆ సినిమాకి సంగీతాన్నిచ్చిన అరుణ్‌ చిలివేరు ‘రామం రాఘవం’ సినిమాకు చక్కని సంగీతాన్ని ఇచ్చారని ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. టీమందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ 21వ తారీకు కోసం ఎదురు చూస్తున్నా ’’ అన్నారు.

    సముద్రఖని మాట్లాడుతూ–‘‘ నా సొంత తమ్ముడులాంటి నాని ‘రామం రాఘవం’ ట్రైలర్‌లాంచ్‌ చేయటం సంతోషంగా ఉంది. ధన్‌ రాజు దర్శకత్వంలో ఫిబ్రవరి 21న వస్తున్న మా సినిమాని ధియేటర్‌లో చూసి నన్ను మా టీమ్‌ని ఆశీర్వదించండి’’ అన్నారు.

    ధన్‌రాజ్‌ మాట్లాడుతూ–‘‘ ఈ రోజు నానిగారు దర్శకునిగా నా మొదటి సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేయటం హ్యాప్పీగా ఉంది. అడగ్గనే మా ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన నాని గారికి కృతజ్ఞతలు. ఫాదర్‌–సన్‌ ఎమోషనల్‌ డ్రామాలో ఇప్పటివరకు ఎవరు ట్రై చేయని యూనిక్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న మా సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

    నిర్మాత పృధ్వీ పోలవరపు మాట్లాడుతూ–‘‘ కంటెంట్‌ ఫుల్‌గా ఉన్న మా సినిమా ట్రైలర్‌ను నాని గారు విడుదల చేయటంతో మా సినిమా టీ మ్‌కి మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి ప్రమోదిని, సంగీత దర్శకుడు అరుణ్‌ చిలివేరు తదితరులు పాల్గొన్నారు.