- July 16, 2025
మిస్టర్ బచ్చన్‌ని మరీ అలా అనేశాడేంటి?

నాగవంశీ సోషల్ మీడియాలో, మీడియాలో మాట్లాడే మాటలు, వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏదైనా సరే తన మనసులోంచి వచ్చినవి వచ్చినట్టుగా అలా మాట్లాడేస్తుంటాడు. ఫిల్టర్ చేసుకుని మాట్లాడటం నాగవంశీకి తెలియదు. అది ఎవరి గురించైనా సరే.. తనకేం అనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. అలాంటి నాగవంశీ తాజాగా కింగ్డమ్ ప్రమోషన్స్‌లో భాగంగా హరీష్ శంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడాల్సి వచ్చింది.
రవితేజతో మాస్ జాతర అంటూ నాగవంశీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వింటేజ్ రవితేజను చూపిస్తామని నాగవంశీ అన్నట్టుగా కనిపిస్తోంది. ఇలానే గతంలో కూడా చాలా మంది అన్నారు.. అలా చూపించేందుకు ట్రై చేశారు కదా అని మిస్టర్ బచ్చన్‌ని ఉదాహరణగా చూపించాడు. అలా యాంకర్ చెప్పిన దానికి నాగవంశీ ఏదో చెప్పాలని.. మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడొద్దు కానీ.. సరే అంటూ.. ఏదో చెప్పబోయి.. వద్దులే.. ఆ సినిమా గురించి ఎందుకు అన్నట్టుగా లైట్ తీసుకున్నాడు.
అంటే నాగవంశీ మళ్లీ ఆ మూవీని తిట్టి.. అదొక పెద్ద రచ్చగా మారి.. కాంట్రవర్సీకి దారి తీయడం.. మళ్లీ వివరణ ఇచ్చుకోవడం ఎందుకు? అని అనుకున్నాడేమో. మొత్తానికి హరీష్ శంకర్ తీసిన ఈ చిత్రం కనీసం కామెంట్ చేయడానికి కూడా పనికి రాని చిత్రంగా నిలిచిపోయింది. మిస్టర్ బచ్చన్ అయితే డిజాస్టర్లకే డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.