• October 29, 2021

ట్విట్టర్ రివ్యూ : వరుడు కావలెను.. అవుట్ డేటెడ్ మూవీ

ట్విట్టర్ రివ్యూ : వరుడు కావలెను.. అవుట్ డేటెడ్ మూవీ

    నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రం గురించి తాజాగా ట్విట్టర్‌లో టాక్ మొదలైంది. ఈ సినిమా గురించి రివ్యూలు ఇచ్చేస్తున్నారు. మొత్తానికి సినిమా ఫలితం మెల్లిమెల్లిగా వచ్చేస్తోంది.

    సినిమాలో చాలా యావరేజ్‌గా ఉంది, ఫస్ట్ పర్లేదు అని సెకండాఫ్ మాత్రం అస్సలు బాగా లేదని అంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయిపోయి ఎండ్ కార్డ్ పడే వరకు ఎవ్వరూ ఉండరని అంటున్నారు. మొత్తానికి సినిమాను అవుట్ డేటెడ్ అంటూ తేల్చేశారు. పాటలు ఫ్రెష్‌గా అనిపిస్తాయని, స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని అంతా అంటున్నారు. కనీసం ఇంట్రెస్ట్‌గా గానీ ఎంటర్టైన్‌గానూ లేదని అంటున్నారు.

    మొత్తానికి యావరేజ్ సినిమాగా మిగులుతుందని అంటున్నారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, కొన్ని సీన్లు సినిమాకు హైలెట్‌గా మారుతాయని అంటున్నారు. అయితే కొన్ని మాత్రం ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కానీ వాటిని తెరకెక్కించిన తీరు మాత్రం చాలు మూసధోరణిలో ఉన్నాయని అంటున్నారు.

     

    Leave a Reply