• January 22, 2022

Naga Shaurya బర్త్ డే.. Krishna Vrinda Vihari ఫస్ట్ లుక్

Naga Shaurya బర్త్ డే.. Krishna Vrinda Vihari ఫస్ట్ లుక్

    Naga Shaurya-Krishna Vrinda Vihari హ్యాండ్సమ్ యాక్టర్ నాగ శౌర్య విభిన్న కథా చిత్రాలను, డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై అనిష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నారు.

    నాగ శౌర్య పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కృష్ణ వ్రిందా విహారి అనే ఈ టైటిల్‌ ఎంతో ట్రెడిషనల్‌గా, భక్తి భావాన్ని కలిగించేలా ఉంది. టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది.

    ఇక ఈ పోస్టర్‌లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నారు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించారు.  మొత్తానికి పోస్టర్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇది వరకు నాగ శౌర్య చేసిన పాత్రలకంటే ఇందులో చేయబోతోన్న రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతోన్నారు.

    ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది. ఇక ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాధిక ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు. ఈ మూవీలో ఇంకా చాలా మంది కమెడియన్స్ ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపిస్తారు.

    శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి కమెడియన్స్ ముఖ్య పాత్రలను పోషించారు.

    Leave a Reply