- November 1, 2021
నాగ శౌర్య ఫాం హౌస్‌లో అలాంటి పనులు!.. పోలీసుల దాడి

యంగ్ హీరో నాగ శౌర్యకు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఎలాంటి వివాదాలకు వెళ్లడు.. తన పని ఏదో తాను చేసుకుని వెళ్లిపోతాడు అనే టాక్ ఉంది. కానీ తాజాగా ఆయన పేరు పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. నాగ శౌర్య ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేయగా.. అసలు సంగతి బయటపడింది. ఫాంహౌస్‌ను కాస్తా.. పేకాట క్లబ్బుగా మార్చేశారట. అయితే ఇందులో నాగ శౌర్య పాత్ర ఎంత ఉందనే విషయం మాత్రం తెలియడం లేదు.
అది నాగ శౌర్య ఫాం హౌస్ అయినా కూడా అందులో తన పాత్ర ఉందా?లేదా? అనే కోణంలోంచి విచారిస్తున్నారు. నాగ శౌర్య క్లోజ్ ఫ్రెండ్ ఇదంతా నడిపిస్తున్నాడని తెలుస్తోంది. అలా పోలీసులు దాడి చేయగా.. మొత్తానికి ఇరవై మంది పట్టుబడ్డారట. వారి నుంచి ఫోన్లు, స్వైపింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారట. దాదాపు 20 లక్షల నగదు కూడా లభించినట్టు తెలుస్తోంది. మొత్తానికి నాగ శౌర్య మెడకు కూడా ఈ కేసు చుట్టుకునేలా ఉంది.
ఆ ఫౌంహౌస్ సొంతది కాకపోయినా.. ఐదేళ్లు లీజుకు తీసుకున్నాడట. అయితే ఇలాంటి కేసుల్లో సెలెబ్రిటీలు చిక్కుకోవడం కొత్త విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇది వరకు నటుడు కృష్ణుడు కూడా ఇలానే అరెస్ట్ అయ్యాడు. కానీ ఆ తరువాత ఈ విషయాన్ని అంతగా బయటకు రానివ్వలేదు. ఇక ఇప్పుడు నాగ శౌర్య వంతు వచ్చినట్టుంది.