• December 26, 2021

నువ్ లేకపోతే సాధ్యమయ్యేది కాదు.. నాగబాబు ఎమోషనల్

నువ్ లేకపోతే సాధ్యమయ్యేది కాదు.. నాగబాబు ఎమోషనల్

    Naga Babu-Padmavathi మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సమాజంలోని పరిస్థితులను విశ్లేషిస్తుంటాడు. రాజకీయ అంశాలపై మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకుంటాడు. యూట్యూబ్ వీడియోలతో నాగబాబు చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొందరిలో స్ఫూర్తిని నింపుతాయ్. అయితే ఈ మధ్య కాస్త రిలాక్స్ అవుతున్నట్టున్నాడు.

    ఎక్కువగా వీడియోలు చేయడం లేదు.. కామెంట్లు చేయడం లేదు.. ఫాలోవర్లతో చిట్ చాట్ లేదు.. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టడం లేదు.. కానీ నాగబాబు మాత్రం తన మిత్రులు, బంధువులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల బర్త్ డే అయితే కచ్చితంగా విషెస్ అందిస్తాడు. చిన్నా పెద్దా అనే తేడా ఏమీ చూడడు. తాజాగా తన సతీమణి పద్మావతి పుట్టిన రోజు సందర్బంగా ఎమోషనల్ అయ్యాడు.

    నాగబాబు కెరీర్‌లో ఎన్ని ఎత్తు పల్లాలున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్ని సినిమాలు నిర్మించినా కూడా డబ్బు రాలేదు కానీ మంచి పేరు వచ్చింది. ఆరెంజ్ సినిమాతో ఉన్నదంతా పోయింది. అలాంటి సమయంలోనూ తన భార్య ఎంత ధైర్యంగా ఉందో, తనకు అండగా ఎలా నిలబడిందో చెబుతుంటాడు. పిల్లలకు తాను టైం ఎప్పుడూ కేటాయించలేదని, తన భార్యే చూసుకునేదని నాగబాబు అంటుంటాడు.

    అలాంటి తన భార్యకు నాగబాబు ప్రత్యేకంగా విషెస్ అందించాడు. ఈ ప్రపంచంలో బతకడం ఎంతో కష్టం. ఒక వేళ నువ్ నాతో ఉండకపోయి ఉంటే మరింత కష్టంగా మారేది.. కష్టకాలంలో నువ్ చేసిన ప్రతీదానికి థ్యాంక్స్. నీ ప్రేమతో కొన్ని సార్లు, నీ ప్లానింగ్‌తో ఇంకొన్ని సార్లు కష్టాలను దూరం చేశావ్.. హ్యాపీ బర్త్ డే డియర్ పద్మ.. నా సర్వస్వం నువ్వే అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.

    Leave a Reply