- May 11, 2024
“డార్లింగ్” సినిమాతో నభా నటేష్ ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది – దర్శకుడు అశ్విన్ రామ్
చిన్న గ్యాప్ తర్వాత హీరోయిన్ నభా నటేష్ తెలుగులో చేస్తున్న మూవీ డార్లింగ్. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. హనుమాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయ్యింది.
ఈ సందర్భంగా మూవీ టీమ్ తనకు ఇచ్చిన సపోర్ట్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు ఆశ్విన్ రామ్. ఆయన ప్రత్యేకంగా హీరోయిన్ నభా నటేష్ ను ప్రశంసించారు. “డార్లింగ్” సినిమాలో నభా నటన ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుందని అశ్విన్ రామ్ అన్నారు. ఈ కథలోని పాత్రను ఆమె అర్థం చేసుకుని, ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.
నభా నటేష్ తన మొదటి సినిమా నన్ను దోచుకుందువటే నుంచే ఇలాంటి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అందంతో పాటు ఆకట్టుకునే పర్ ఫార్మెన్స్ చేయగల నాయికగా గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ లో చిన్న గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్లీ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తోంది నభా నటేష్. “డార్లింగ్” తో పాటు ఆమె ఖాతాలో నిఖిల్ సరసన నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు కూడా ఉంది.