• July 31, 2022

Athadu సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్!.. మెగా ఫ్యామిలీ వల్లే దూరమైందట

Athadu సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్!.. మెగా ఫ్యామిలీ వల్లే దూరమైందట

    Athadu అతడు సినిమా మహేష్ బాబు కెరీర్‌లో, త్రివిక్రమ రైటింగ్, టేకింగ్‌కు ఓ మార్క్‌లా నిలిచింది. ఈ చిత్రం వెండితెరపై కలెక్షన్ల వర్షం కురిపించలేదు. నిర్మాత మురళీ మోహన్‌కు అంతగా లాభాలను తీసుకురాలేదు. కానీ ఇప్పటికీ అతడు సినిమా ఎవర్ గ్రీన్. బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్. స్టార్ మాలో ఎన్ని సార్లు ఈ సినిమాను ప్రదర్శించినా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది. అలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమా వెనకలా ఎంతో జరిగిందట.

     

    తాజాగా మురళీ మోహన్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు పంచుకున్నారు.అతడు సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో రహస్యాలు చెప్పాడు. ఈ సినిమాలో ముందుగా ఉదయ్ కిరణ్‌ను హీరోగా తీసుకుందామని అనుకున్నారట. చిత్రం సినిమా నుంచే ఉదయ్ కిరణ్‌ను మెచ్చుకుంటూ వచ్చాడట మురళీ మోహన్. అలా తరుచు తన ఇంటికి ఉదయ్ కిరణ్ వచ్చేవాడట. అయితే అతడు సినిమాలో ఉదయ్ కిరణ్‌ను హీరోగా అనుకున్నారట.

     

    కానీ అప్పటికే మెగా ఫ్యామిలీతో ఉదయ్ కిరణ్ చేరిపోయాడట. ఉదయ్ కిరణ్‌ను తమ ఇంటి అల్లుడిగా చేసుకుంటున్నామనే నిర్ణయాన్ని ప్రకటించేశారట. దాంతో ఉదయ్ కిరణ్ డేట్స్, డైరీని, సినిమాలను మెగా కాంపౌండ్ అంటే అల్లు అరవింద్, చిరంజీవి చూస్తూ వచ్చారట. అతడు కోసం డేట్స్ అడిగితే.. అప్పటికే వేరే సినిమాకు ఇచ్చేశారట. ఇదే విషయాన్ని ఉదయ్ కిరణ్ చెప్పాడట. ఇప్పుడు డేట్స్ ఖాళీగా లేవండి, వేరే సినిమాలకు ఇచ్చారట.. వచ్చే ఏడాది చేయగలను అని మురళీ మోహన్‌తో ఉదయ్ కిరణ్ చెప్పాడట.

     

    ఆ తరువాత అతడు కథలోకి మహేష్ బాబు వచ్చాడట. ఉదయ్ కిరణ్ ఖాతాలో అతడు మిస్ అవ్వడానికి మెగా ఫ్యామిలీనే కారణమైంది. ఈ విషయాలన్నీ మురళీ మోహన్ చెప్పడంతో నెట్టింట్లో మరోసారి చర్చలకు దారి తీస్తోంది.