• September 8, 2022

ఆబ్కారీ శాఖా మాత్యులు శ్రీనివాస్ గౌడ్, మక్తల్ MLA శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ‘హరికథ’ టైటిల్ అనిమేషన్ లాంచ్

ఆబ్కారీ శాఖా మాత్యులు శ్రీనివాస్ గౌడ్, మక్తల్ MLA శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ‘హరికథ’ టైటిల్ అనిమేషన్ లాంచ్

  వైవిధ్యభరితమైన స్టోరీతో ‘హరికథ’ అనే అట్రాక్టివ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఓ కొత్త సినిమా. ఈ మూవీలో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించారు.

  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సర్వ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి టైటిల్ అనిమేషన్ లాంచ్ మరియు పోస్టర్ లాంచ్ తాజాగ తెలంగాణ క్రీడలు, యువజన, పర్యాటక మరియు ఆబ్కారీ శాఖా మాత్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మక్తల్ MLA శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది.

  ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు అనుదీప్ రెడ్డి సహా నటీనటులు- కిరణ్, అఖిల, భాస్కర్ మన్యం, లావణ్య రెడ్డి, రంజిత్. నిర్మాతలు – రంజిత్ గౌడ్, వివేకానంద గౌడ్, రఘు గౌడ్, కవిత గౌడ్, DOP – SK మస్తాన్, షరీఫ్, సంగీత దర్శుడు మహావీర్, ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి, మేనేజర్ – కొండనాయుడు, మిత్రులు, శ్రేయోభిలాషులు విశ్వనాథ్ గౌడ్, విద్యాసాగర్ గౌడ్, బాల్ రాజ్ గౌడ్, నవీన్ నాయిని గారు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు తెలంగాణ క్రీడలు, యువజన, పర్యాటక మరియు ఆబ్కారీ శాఖా మాత్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్.

  హరికథ సినిమా వినూత్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా అని, ఇది అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు అనుదీప్ రెడ్డి పేర్కొన్నాడు. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన సినిమా ఇది అని తెలిపారు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

  నటీనటులు : కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, భాస్కర్ మన్యం, కీర్తి

  సాంకేతిక నిపుణులు :

  బ్యానర్ : ఐరావత సినీ కలర్స్
  నిర్మాతలు : రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు , కవిత
  దర్శకుడు : అనుదీప్ రెడ్డి
  సంగీతం : మహావీర్
  సినిమాటోగ్రఫర్ : SK మస్తాన్ షరీఫ్
  ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి
  పి ఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు