• August 6, 2022

#MegastarKalyanRam.. ఇది ఎంత వరకు సమంజసం?.. నెట్టింట్లో చర్చ

#MegastarKalyanRam.. ఇది ఎంత వరకు సమంజసం?.. నెట్టింట్లో చర్చ

    మెగాస్టార్ అంటే తెలుగువారికి ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు. మెగాస్టార్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే మెగాస్టార్. మెగాస్టార్ స్థాయికి చేరుకోవడానికి చిరంజీవి ఎన్నో ఏళ్లు పట్టింది. ఉన్నపళంగా వచ్చిన స్థాయి ఏమీ కాదది. చిరంజీవి తనంతట తానేమీ మెగాస్టార్ అని పెట్టుకోలేదు. అది జనంలోంచి, ఇండస్ట్రీలోంచి వచ్చింది. మెగాస్టార్ అనే పదానికి పర్యాయపదంగా మారిపోయాడు చిరంజీవి.

    అలాంటి చిరంజీవి ట్యాగును కళ్యాణ్ రామ్‌కు(#MegastarKalyanRam) ఆపాదిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. దానికి బింబిసార అనే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కారణం. కళ్యాణ్ రామ్ బింబిసారతో లేక లేక హిట్ కొట్టేశాడు. కళ్యాణ్ హిట్ కొట్టేసి చాలా ఏళ్లే అయింది. పటాస్ సినిమాతో ఊపిరి పోసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు బింబిసారతో హిట్ ట్రాక్ ఎక్కేశాడు.

    ఆచార్య సినిమా దారుణంగా డిజాస్టర్ అయినంత మాత్రానా.. బింబిసార హిట్ అయినంత మాత్రం మెగాస్టార్ ట్యాగ్‌ను ఇలా వాడేసుకుంటారా? అనే చర్చ మొదలైంది. నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు చేస్తోన్న అతి మాత్రం హద్దులు దాటుతోందని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అఖండ హిట్ అంటూ.. ఆర్ఆర్ఆర్ హిట్ అంటూ. దాని క్రెడిట్ మొత్తాన్ని ఎన్టీఆర్ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు బింబిసార అంటూ.. నందమూరి హీరోలే సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఊపిరి పోస్తున్నారంటూ నానా రచ్చ చేస్తున్నారు.

    దీనిపై సాధారణ జనాలు కూడా నవ్వుకుంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నందమూరి అభిమానుల అతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసారకు మంచి టాక్ వచ్చిందని తెలిసి చిరంజీవి మంచి మనసుతో విష్ చేసినా కూడా దాని పైనా పెడార్థాలు తీస్తున్నారు నందమూరి అభిమానులు. దీనిపై వారే కాస్త ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని వారి మనస్సాక్షికే వదిలేయాలి. ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఓ శుక్రవారం రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. జనాలు వస్తున్నారు,బాక్సాఫీస్ కళకళలాడుతుందని సంతోష పడక.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇలా ఒక్క హిట్‌కే ఎగిరిఎగిరి పడుతున్నారంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.