మెగా ఫ్యామిలీని దూరం పెట్టిన మంచు.. ప్రమాణ స్వీకారోత్సవంతో అది స్పష్టం!

మెగా ఫ్యామిలీని దూరం పెట్టిన మంచు.. ప్రమాణ స్వీకారోత్సవంతో అది స్పష్టం!

    ప్రస్తుతం ఇండస్ట్రీలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. మామూలుగా అయితే అందరి కళ్లు మెగా ఫ్యామిలీ మీదే ఉంటాయని అంతా అంటారు. సినిమాల పరంగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీదే ఎక్కువ వాటా ఉంటుంది. రెవెన్యూ పరంగానూ మెగా హీరోలదే అత్యధిక వాటా ఉంటుంది. అరడజను మంది హీరోలున్నా మెగా కాంపౌండ్‌ను ఇప్పుడు మంచు ఫ్యామిలీ కావాలనే దూరం పెడుతున్నట్టు కనిపిస్తోంది.

    మా ఎన్నికల వల్ల ఇండస్ట్రీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ప్రకాష్ రాజ్‌కు మెగా మద్దతు ఉండటం, మంచు విష్ణు కావాలనే బరిలోకి దిగడం వెనక ఏదో బయటకు తెలియని కారణం ఉన్నట్టు కనిపిస్తోంది. ముందుగా ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేయడం గురించి ప్రచారం మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కలిసి తన నిర్ణయాన్ని చెప్పాడు. ఆ తరువాత మోహన్ బాబు, మంచు విష్ణులు రంగంలోకి దిగా.. తాను కూడా పోటీలో ఉన్నానని ప్రకటించాడు.

    దీంతో సమస్య మొదలైంది. మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ చేసి.. విష్ణును ఈ సారి తప్పుకోమని.. వచ్చే సారికి ఏకగ్రీవం చేద్దామని చిరు సలహా ఇచ్చాడు. కానీ మంచు వారి వినలేదు. మొండిగా ముందడుగు వేశారు. మొత్తానికి మంచు వారినే విజయం వరించింది. అది ఎలా వచ్చినా కూడా విజయం విజయమే. మొత్తానికి మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

    మా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బాలయ్య బాబును కలిశాడు మంచు విష్ణు. చిరంజీవిని కూడా త్వరలోనే కలుస్తాను అని చెప్పాడు. అంటే ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా చిరంజీవి పేరును కూడా ప్రస్థావించలేదు. అసలు అది మా ప్రమాణ స్వీకారోత్సవంలా లేదు. మంచు వారి ఇంటి వేడుకలా మారిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.

    అలా అందరినీ కలుపుకుని పోతాను అని చెప్పిన మంచు విష్ణు.. మొదటి రోజే తన పక్షపాతాన్ని చూపించేస్తున్నాడు. ఇలా అయితే మెగా ఫ్యామిలీ మంచు వారి మధ్య చెరపలేని దూరం పెరిగేట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు అవకాశాల్లో అందరికీ కోతలు పడేట్టు కనిపిస్తోంది. అక్కడి వారికి ఇక్కడ.. ఇక్కడి వారికి అక్కడ అవకాశాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

    Leave a Reply