• October 27, 2021

Manchu Vishnu: ఫ్లైట్‌లోనే అది కావాలని భార్యను అడిగేశాడు.. మంచు విష్ణు మామూలోడు కాదు

Manchu Vishnu: ఫ్లైట్‌లోనే అది కావాలని భార్యను అడిగేశాడు.. మంచు విష్ణు మామూలోడు కాదు

    Manchu Vishnu మంచు విష్ణు ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. మా ఎన్నికల వల్ల గత రెండు నెలలుగా మీడియాలోనే తిరిగాడు. ఆ తరువాత మా ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠం ఎక్కేశాడు. మా వివాదాలతోనే నిత్యం మంచు విష్ణు వార్తల్లోకి ఎక్కేశాడు. మళ్లీ యూట్యూబ్ చానెళ్ల మీద మంచు విష్ణు ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించాడు. హీరోయిన్ల మీద తప్పుడు వార్తలు, పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చాడు.

    అయితే మంచు విష్ణు ఇప్పుడు తాజాగా వీటన్నంటికి దూరంగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అమెరికాకు బయల్దేరేందుకు మంచి ప్లాన్ వేసుకున్నాడు. భార్య మంచు విరానికతో కలిసి విష్ణు అమెరికాకు చెక్కేస్తున్నాడు. ఈ వెకేషన్ గురించి మంచు విరానిక తన ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. అయితే ఇందులో మంచు విష్ణు చేసిన కామెంట్లు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచు విష్ణు ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే.

    భార్యతో కలిసి మంచు విష్ణు ఫ్లైట్‌‌లోనే సరసాలు ఆడాడు. ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేస్తున్న విరానికి.. మంచు విష్ణును చూపించింది. హాయ్ చెప్పు అని విష్ణుని విరానిక అడిగింది. దానికి బధులుగా విష్ణు ఓ డిమాండ్ చేశాడు. ముద్దు ఇస్తావా? మరి అని కండీషన్ పెట్టేశాడు. నేను హాయ్ చెప్పమన్నాను అంతే అని విరానిక కాస్త స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ముద్దు ఇస్తావా? మరి అని మళ్లీ మంచు విష్ణు అడిగేశాడు. అయితే మంచు వారబ్బాయి మాత్రం మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది.

    Leave a Reply