మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం.. రూమర్లపై మంచు మనోజ్ చురకలు

మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం.. రూమర్లపై మంచు మనోజ్ చురకలు

    మంచు వారబ్బాయి మనోజో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మీడియాలో వచ్చే రూమర్ల మీద వెంటనే స్పందిస్తాడు. తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటాడు. మీమ్స్ వాడటంతో మంచు మనోజ్ శైలి వేరు. ఇక ఈ మధ్య ఆర్జీవీ, మనోజ్ మధ్య జరుగుతున్న సంభాషణ గురించి కూడా అందరికీ తెలిసిందే. మా ఎన్నికల మీద వర్మ సెటైర్లు వేస్తే.. వర్మ మీద మనోజ్ కౌంటర్లు వేస్తున్నాడు. అలా ఈ ఇద్దరి మధ్య ట్వీట్ల ముచ్చట్లు మంచిగానే వైరల్ అవుతున్నాయి.

    అయితే సందులో సడేమియా అన్నట్టుగా మంచు మనోజ్ రెండో పెళ్లి ముచ్చట్లను గాలి వార్తల్లా మళ్లీ పుట్టించారు. ఎవరో ఒకరు పుట్టించిన ఈ వార్తలు ఇప్పుడునెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 2015లో ప్రణతి రెడ్డితో మనోజ్ వివాహాం జరిగింది. అయితే గత ఏడాదే ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్లీ తన సినీ లైఫ్‌ను కొత్తగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాడు. ఆ తరువాత ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. కరోనా వల్ల అది కాస్త ఆలస్యమైంది.

    కానీ ఇప్పుడు ఈ రెండో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఎవరో అమ్మాయిని మంచు మనోజ్ ప్రేమించాడని, కానీ మోహన్ బాబు మాత్రం దగ్గరి బంధువుల అమ్మాయిని చూశాడంటూ ఎవరికి తోచినట్టుగా వారు రాశారు. అలా మనోజ్ ఓ వెబ్ సైట్ రాసిన వార్తపై కౌంటర్ వేశాడు. నాకు కూడా ఇన్విటేషన్ ఇవ్వండి.. పెళ్లి ఎక్కడ జరుగుతోంది.. ఆ బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఎవరు?.. మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం అంటూ బ్రహ్మానందం స్టైల్లో అనేశారు. దీంతో రెండో పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది.

    Leave a Reply