• January 26, 2022

Sarkaru Vaari Paata : ప్రేమికుల దినోత్సవం నాడు మహేష్ ట్రీట్

Sarkaru Vaari Paata : ప్రేమికుల దినోత్సవం నాడు మహేష్ ట్రీట్

    Sarkaru Vaari Paata Music సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం నుంచి ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నామని చిత్రయూనిట్ ప్రకటించింది.

    సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న ఈ ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవబోతోంది. ఈ పాటను ఫిబ్రవరి 14న విడదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అద్భుతమైన పాటలను అందించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోన్న ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా చిత్రీకరించారు.

    మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.  మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఈ చిత్రంలో నటించారు.

    Leave a Reply