• November 3, 2021

Mahesh Babu: ఏప్రిల్‌లో ‘సర్కారు వారి పాట’!.. వేసవిలో మహేష్ సందడి

Mahesh Babu: ఏప్రిల్‌లో ‘సర్కారు వారి పాట’!.. వేసవిలో మహేష్ సందడి

    Mahesh Babu మహేష బాబు సర్కారు వారి పాట సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు ఏంటో తెలియదు గానీ మొత్తానికి మాత్రం సర్కారు వారి పాట వెనుకడుగు వేసింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు చెప్పకనే చెప్పేసింది. కొత్త రిలీజ్ డేట్‌ను కాసేటి తరువాత ప్రకటిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు న్యూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారట.

    అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రాబోతోందంట. సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే అవుతుంది. వేసవి సెలవులు కలిసి వచ్చేలానే ఉన్నాయి. ఇది పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు ఏప్రిల్లోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

    మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

    Leave a Reply