• February 5, 2022

అందుకే అలా పెళ్లి చేసుకున్నా : మహేష్ బాబు

అందుకే అలా పెళ్లి చేసుకున్నా : మహేష్ బాబు

    Mahesh Babu Namrata Shirodkar marriage మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి ఎన్నో రకాలుగా కథనాలు వినిపిస్తుంటాయి. ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా, ఎవరినీ పిలవకుండా చేసేసుకున్నాడు. అయితే ఎక్కడా కూడా ఈ పెళ్లి గురించి మహేష్ బాబు ఓపెన్ అవ్వలేదు. ఈ పర్సనల్ మ్యాటర్ గురించి ఎక్కడా కూడా నోరు విప్పలేదు. కానీ మొదటి సారిగా మహేష్ బాబు నోటి నుంచి అసలు విషయాన్ని చెప్పించాడు బాలయ్య.

    బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో దుమ్ములేపేశాడు. మహేష్ బాబు, బాలయ్య ముచ్చట్లలో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగానే తన పెళ్లి గురించి మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఏంటయ్యా.. ఇండస్ట్రీ అంటావ్.. మాకు ఎవ్వరికీ చెప్పలేదు.. వెకేషన్ అని పెళ్లి చేసుకుని వచ్చావ్ అని బాలయ్య అడిగేస్తాడు. దానికి మహేష్ ఇలా సమాధానం చెప్పాడు.

    లేదండి. మొదటగా ఆ విషయాన్ని నాన్నకు చెప్పాను. నువ్ కరెక్ట్‌గానే ఉన్నావా? అని అడిగారు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను నాన్న.. మీరు కూడా ఓ సారి ఆ అమ్మాయిని చూడండి.. చాలా మంచిది.. అని చెప్పాను. నాన్న చూశారు. నచ్చింది. ఆ వెంటనే పెళ్లి కూడా చేసేసుకున్నాం. అదో ప్రైవేట్ ఈవెంట్‌లా కుటుంబ సభ్యుల మధ్యే వివాహాం జరిగిందని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

    మొత్తానికి ఇంట్లో మాత్రం అన్నింటినీ నమ్రతే చూసుకుంటుందట. మహేష్ మాత్రం కేవలం నటించడం ఇంటికి రావడం పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి పడుకోవడం. ఇంతేనట తన డైలీ వర్క్. మిగతా పనులన్నీ నమ్రతేప చూసుకుంటుందని మహేష్ తెలిపాడు. వంశీ సినిమాతో మహేష్ బాబు, నమ్రతల మధ్య పరిచయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

    Leave a Reply