• January 7, 2022

Lakshmi Manchu : టాలీవుడ్‌లో కరోనా కలకలం.. మహేష్, మంచు లక్ష్మీ, నితిన్ భార్యలకు పాజిటివ్

Lakshmi Manchu : టాలీవుడ్‌లో కరోనా కలకలం.. మహేష్, మంచు లక్ష్మీ, నితిన్ భార్యలకు పాజిటివ్

    Mahesh Babu ప్రస్తుతం దేశంలో కరోనా ఎలా ఉధృతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్, కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తాండవం చేస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌ను కూడా కరోనా గజగజ వణికిస్తోంది.

    టాలీవుడ్ స్టార్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, నితిన్ భార్యలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు దుబాయ్‌లో తన ఫ్యామిలీతో ఉన్నాడు. అయినా కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అసలే మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. దుబాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఇలా ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు.

    మరో వైపు మంచు లక్ష్మీ సైతం కరోనా బారిన పడింది. అందరూ అప్రమత్తంగా ఉండండి.. మాస్కులు ధరించండి.. వ్యాక్సిన్ వేసుకోండి.. రెండు డోసులు వేసుకుంటే ఇంకా మంచిది అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నితిన్ భార్య కూడా కరోనా బారిన పడిందని తెలుస్తోంది.

    ఈ విషయాన్ని నితిన్ వెరైటీ ట్వీట్ వేసి తెలిపాడు. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ వేశాడు. కరోనాకు హద్దులున్నాయ్.. కానీ ప్రేమకు హద్దుల్లేవ్.. లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు నెగెటివ్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

    Leave a Reply