• January 9, 2022

Ramesh Babu Death : అన్నను కడసారి చూసుకోలేకపోతోన్నాడు.. మహేష్‌కు తీరని కష్టం

Ramesh Babu Death : అన్నను కడసారి చూసుకోలేకపోతోన్నాడు.. మహేష్‌కు తీరని కష్టం

    Mahesh Babu-Ramesh Babu సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పుడు తీరని కష్టం ఏర్పడింది. కరోనా పాజిటివ్‌తో క్వారంటైన్‌కు పరిమితమైన మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చే దారిలోనే మృతి చెందారు.

    రమేష్ బాబు మరణంతో ఇండస్ట్రీ అంత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అయితే రమేష్ బాబు మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఒక్కసారిగా కుంగిపోయింది. అటు మహేష్ బాబు కరోనాతో బాధపడుతున్నాడు. ఇటు రమేష్ బాబు లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ తమ అభిమానులకు ఓ విన్నపం చేసింది.

    కరోనా నేపథ్యంలో ఎవ్వరూ అంత్యక్రియల వద్ద గుమిగూడవద్దని, అందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇక మహేష్ బాబుకు మాత్రం ఇది తీరని కష్టమే అవుతుంది. ఇంకా నెగెటివ్ రాకపోవడంతో బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. చివరకు అన్న చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితిలో మహేష్ బాబు చిక్కుకున్నాడు.

    Leave a Reply