• November 11, 2024

నవంబర్ 15న ZEE5లో స్ట్రీమింగ్ కాబోతోన్న సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’

నవంబర్ 15న ZEE5లో స్ట్రీమింగ్ కాబోతోన్న సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’

    భారతదేశంలోని అతిపెద్ద ఓటీటీ సంస్థ అయిన ZEE5లో ఇటీవల విడుదలైన తెలుగు బ్లాక్‌బస్టర్ ‘మా నాన్న సూపర్’ డిజిటల్ ప్రీమియర్‌ను ప్రకటించింది. లూజర్ సిరీస్‌ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో సుధీర్ బాబు, సాయాజీ షిండే, సాయి చంద్, ఆర్నా వంటి వారు నటించారు. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్, VR గ్లోబల్ మీడియా బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లో ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్ వచ్చింది.

    నవంబర్ 15 నుంచి ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ కాబోతోంది. హీరో జానీ (సుధీర్ బాబు) తన పెంపుడు తండ్రి (సాయాజీ షిండే) చేసిన అప్పులను తీర్చడానికి కష్టపడుతుంటాడు. అతని పెంపుడు తండ్రి అరెస్ట్ అవ్వడం, విడుదల కోసం రూ. 1 కోటిని సేకరించడానికి జానీ ఏం చేశాడు? ఈ క్రమంలో సొంత తండ్రి ప్రకాష్ (సాయి చంద్)తో కలిసి చేసిన ప్రయాణం ఏంటి? అన్నది ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు.

    https://x.com/ZEE5Telugu/status/1855849678262202769

    నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ.. ‘మా నాన్న సూపర్‌హీరో అనేది తండ్రీ కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌తో నేను వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యాను. ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రం. థియేటర్‌లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ZEE5లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులు కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఉద్వేగభరితమైన కథనాన్ని ZEE5తో పంచుకోవడం ఆనందంగా ఉంది. ZEE5 ఇస్తున్న సహకారానికి థాంక్స్. ZEE5 ప్లాట్‌ఫారమ్‌తో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.

    దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ.. ‘ZEE5తో నా ప్రయాణం లూజర్‌తో ప్రారంభమైంది. అది అద్భుతమైన అనుభవం, భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మా నాన్న సూపర్‌ హీరోతో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. ‘తండ్రి ప్రేమే కొడుకు బలానికి పునాది’ అన్న సామెతతో ఈ సినిమాలో సుధీర్ బాబు ఆ పాత్రకి ప్రాణం పోశారు. సుధీర్ బాబు అద్భుతమైన నటనకు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్‌తో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ZEE5తో ఈ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి, భవిష్యత్తులో కలిసి మరిన్ని ప్రభావవంతమైన కథనాలను రూపొందించడానికి ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

    సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘మా నాన్న సూపర్‌హీరోకి థియేటర్లలో లభించిన ప్రేమ, ప్రశంసలకు నేను నిజంగా పొంగిపోయాను. జానీ పాత్రను పోషించడంతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. ప్రేమ, కర్తవ్యం, నిజాల మధ్య నలిగిపోయే పాత్ర. ఈ కథకు జీవం పోయడం ఒక విశేషం. నాకు అద్భుతమైన మద్దతు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ZEE5లో సినిమా ప్రీమియర్‌ కానుంది. అప్పుడు కూడా అదే ప్రేమ అందిస్తారని, ఆ పాత్రతో, సినిమాతో కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

    ZEE5 గురించి…

    జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.