- January 7, 2022
బికినీ పిక్ అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi లావణ్య త్రిపాఠి అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ ఉత్తరాది భామ తెరపై ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదు. కారెక్టర్ పరంగా కొన్ని లిమిట్స్ పెట్టుకుంది. మొదటి సారిగా లావణ్య లిప్ లాక్ సీన్‌కు ఒప్పుకుంది. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కోసం మొదటి సారిగా అలాంటి సీన్‌కు లావణ్య అంగీకరించింది. ఇన్నేళ్ల కెరీర్‌లో లావణ్య త్రిపాఠి ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా నటించింది.
మొత్తానికి లావణ్య ఎప్పుడూ కూడా తెరపై విచ్చల విడిగా అందాలను ప్రదర్శించలేదు. సోషల్ మీడియాలో కూడా లావణ్య ఎప్పుడూ కూడా బౌండరీలు దాటలేదు. కానీ గీత ఏడాది లాక్డౌన్ సమయంలో కొంత రచ్చ చేసింది. హాట్ లుక్కులో లావణ్య కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. పొట్టి బట్టల్లో లావణ్య కనిపించడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
లావణ్య త్రిపాఠి తెరపై కనిపించి చాలా రోజులే అవుతోంది. గత ఏడాదిలో లావణ్య కనిపించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా లావణ్య త్రిపాఠి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఒక్కో నెటిజన్ ఒక్కో రకమైన ప్రశ్నలతో లావణ్యను ఉక్కిరి బిక్కిరి చేశారు. అందులో కొందరు ఆకతాయిలు హద్దులు దాటారు కూడా. అయితే లావణ్య మాత్రం వాటికి సరైన సమాధానాన్ని ఇచ్చింది.

ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠి బికినీ ఫోటోను అడిగాడు. ఇంత వరకు లావణ్య త్రిపాఠి ఎప్పుడూ కూడా బికినీని ధరించలేదు. అయితే ఆ నెటిజన్ అలా అడిగే సరికి.. లావణ్య త్రిపాఠి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ముందు నీ బికినీ ఫోటోను పంపు అని కౌంటర్ వేసింది.