• January 20, 2022

లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి రూమర్లు.. చెక్ పెట్టిన హీరోయిన్

లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి రూమర్లు.. చెక్ పెట్టిన హీరోయిన్

    Lavanya Tripathi Varun Tej Love Story లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొట్టేశాయి. అయితే లావణ్య ఎక్కువగా మెగా ఈవెంట్లలో కనిపించడమే దీనికి కారణమని తెలుస్తోంది. లావణ్య, నిహారిక చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. ఒకే జిమ్‌లో వర్కవుట్లు చేసేవారు. ఇక ఆ మధ్య నార్త్ టూర్ వేసిన సందర్భంలోనూ ఈ ఇద్దరూ కలిసే వెళ్లారు. అలా నిహారిక, లావణ్యల అంత క్లోజ్‌గా ఉండటంతో కొత్త కొత్త రూమర్లు వచ్చాయి.

    వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, అందుకే సదరు హీరోయిన్‌తో నిహారిక మరింత దగ్గరగా ఉంటోందని రాసుకొచ్చారు. అయితే నిన్న వరుణ్ తేజ్ బర్త్ డే. ఈ సందర్బంగా కొంత మంది ఓ గాసిప్‌ను పుట్టించారు. ఓ డైమండ్ రింగ్‌ను వరుణ్ తేజ్ కొన్నాడని, దాన్ని తీసుకుని ముంబైకి బయల్దేరాదని రాసుకొచ్చారు. ఇక పెళ్లి ప్రపోజల్ చేసేందుకే వెళ్లాడని రాసుకొచ్చారు.

    వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలే అయి ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. అయితే లావణ్య వీటిపై పరోక్షంగా స్పందించిందో.. లేదా తాను క్యాజువల్‌గా పోస్ట్ చేసిందో గానీ.. తాను డెహ్రాడూన్‌లోనే ఉన్నానంటూ హింట్ ఇచ్చింది. అలా మొత్తానికి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసినట్టు అయింది. అంతే కాకుండా లావణ్య త్రిపాఠి కూడా వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా కనీసం ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.

    ఒక వేళ ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉంటే.. స్పెషల్‌గా విషెస్ పెట్టేది. కానీ ఇలా ఏమీ పట్టనట్టుగా ఉండేది కాదని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి ఇది రూమరో లేక నిజమవుతుందో దానికి కాలమే సమాధానం చెప్పాలి. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌లు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

    Leave a Reply