- February 7, 2022
Lata Mangeshkar : లతా మంగేష్కర్ ఎస్పీబీలో కాంబోలో వచ్చిన ఒకే ఒక్క పాట

Lata Mangeshkar భారత గాన కోకిల ఇకలేరు. లతా మంగేష్కర్ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నమూశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కరోనా కారణంగా గత నెల 11న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. జనవరి నెలఖారున కరోనా నుంచి కోలుకున్న లతా ఆరోగ్యం శనివారం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆమెకు వైద్యులు చికిత్సనందించినా ఆరోగ్యం విషమించడంతో ఆమె శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ లేరన్న విషయాన్ని ఆమె అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆశాభోస్లే కూడా లతా మంగేష్కర్‌ను నిన్న సాయంత్రం కలిశారు. కానీ ఇలా నేటి ఉదయం మాత్రం లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. లతా మంగేష్కర్ మరణంపై యావత్ భారతావని దు:ఖిస్తోంది. అయితే లతా మంగేష్కర్ అంటే తెలుగువారికి ఎంతో ప్రీతి. కానీ ఆవిడ ఎక్కువగా తెలుగు పాటలు పాడలేదు. ఆమె కెరీర్ మొత్తంలో రెండంటే రెండే తెలుగు పాటలు పాడారు.
అందులో ఒకటి ఎస్పీబీ కూడా పాడాడు. అలా లతాజీతో కలిసి పాడే అదృష్టాన్ని ఎస్పీబీ సొంతం చేసుకున్నారు. ఆఖరి పోరాటం సినిమాలోని తెల్ల చీరకు సరిగమపదనిస అనే పాటను లతా మంగేష్కర్ ఆలపించారు. ఎస్పీబీ లతా మంగేష్కర్ కలిసి ఈ పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ మెలోడిగా మిగిలింది. తెలుగు పాటలు ఎక్కువగా పాడకపోయినా లతా మంగేష్కర్ అంటే మాత్రం ఇక్కడి వారికి ఎంతో అభిమానం.