• February 1, 2024

లక్ష్ చదలవాడ ‘ధీర’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల

లక్ష్ చదలవాడ  ‘ధీర’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల

    వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘ధీర’ అంటూ మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో లక్ష్ సరసన సోనియా భన్సాల్, నేహా పఠాన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన, బెక్కెం వేణుగోపాల్ వంటి వారు వచ్చి సినిమా గురించి గొప్పగా చెప్పారు.

    ధీర మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న విడుదల కాబోతోన్న ఈ మూవీ నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు కొనేశారు. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ మీద హ్యాండ్ వేయడంతో అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. సినిమా బాగుందని, సరైన మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ అని ప్రశంసించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

    నటీనటులు: లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు

    సాంకేతిక బృందం
    సమర్పణ: చదలవాడ బ్రదర్స్
    బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర
    నిర్మాత: పద్మావతి చదలవాడ
    రచన, దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
    సంగీతం: సాయి కార్తీక్
    సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ
    ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
    ఎడిటర్: వినయ్ రామస్వామి
    పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు