- October 23, 2021
ఎంతైనా రాజులు రాజులే!.. పనిమనిషిని సత్కరించిన కృష్ణంరాజు

మారాజు అని కొంత మందిని కీర్తిస్తుంటారు. బాహబలి సినిమాలో చూపించినట్టుగా తమ సేవకులను సేవకుల్లా కాకుండా ప్రజలను బానిసల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకునే రాజులు కొంత మంది ఉంటారు. అలా కృష్ణం రాజులోని ఆ రాజుల బ్లడ్ ఇంకా అలానే ఉన్నట్టుంది. అందుకే తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేసిన మహిళను సత్కరించారు.
అలా మహిళను సత్కరించి మారాజు అనిపించుకున్నాడు కృష్ణంరాజు. ఈ విషయాన్ని ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కూతురు ప్రసీదా ఉప్పలపాటి ట్వీట్ చేసింది. తమ ఇంట్లో పాతికేళ్లుగా పద్మ ఆంటీ పని చేశారు.. ఆమె చేసిన సేవలు అనిర్వచనీయం.. మా బలం ఆమె అంటూ మహిళను సత్కరించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే సమాజంలో దేన్నైనా సరే చెడుగా చూసే వాళ్లు కొందరు ఉంటారు. పాతికేళ్లుగా పని చేస్తే ఆమెకు ఒరిగిందేమిటి? ఇంకా మీ ఇంట్లో పని మనిషిగానే ఉంది?.. ఏదైనా సాయం చేసి సెటిల్ చేయోచ్చు కదా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ పని మనిషి అని తేలికగా చూడకుండా..సముచితన స్థానాన్ని కల్పించడం కంటే గొప్ప విషయం ఏముంటుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.