- November 11, 2021
Kasarla Shyam: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘రాములో రాముల’.. ఎప్పటికీ ప్రత్యేకమేనన్న కాసర్ల శ్యామ్

Kasarla Shyam కాసర్ల శ్యామ్ తెలంగాణ పదాలను, యాసను, భాషను నమ్ముకున్నాడు. అందుకే తన పాటల్లోని సాహిత్యం తెలంగాణ పల్లె పదాలు, వాడుక పదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక ఆయన నుంచి వచ్చిన రాములో రాముల పాట ఇప్పటికీ ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. తాజాగా ఈ పాట మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో కాసర్ల శ్యామ్ ఈ పాట గురించి కామెంట్ చేశాడు.
రాములో రాముల పాట ఎంతటి సంచలనమో చెప్పాల్సిన పని లేదు. తాజాగా మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రాములో రాముల పాటకు స్టెప్పులు వేశాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడేలోపు డ్యాన్సుతో రచ్చ చేశాడు. ఆ వీడియోపై లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ స్పందించాడు. నా జీవితంలో రాములో రాముల పాట ఎప్పటికీ ప్రత్యేకమేనని అన్నాడు.
A special Song in my life#Trivikram garu…@alluarjun garu …@MusicThaman garu… https://t.co/Z5WOZBUckt
— Kasarla Shyam (@LyricsShyam) November 11, 2021
అయితే ఇది కాసర్ల శ్యామ్ జీవితంలో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనే ప్రత్యేకంగా నిలిచి ఉంటుంది. అల వైకుంఠపురములో సినిమా, అందులోని మ్యూజిక్, పాటలు, అవి నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పట్లో అల వైకుంఠపురములో రికార్డులను కొట్టే ఆల్బమ్, పాటలు రావు. ఇకపై రాబోవు. ఇక మాస్, క్లాస్ అని తేడా లేకుండా రాములో రాముల అనే పాట అందరికీ చేరువైంది.