- October 29, 2021
Karthika Deepam Episode 1183 : కుప్పకూలిన ఆనంద్ రావు.. మథనపడ్డ దీప

కార్తీకదీపం సీరియల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు మథన పడుతూనే ఉంటారు. అందరి మొహాల్లో చిరునవ్వులు కనిపించడం అనేది ఉండనే ఉండదు. అలా కొన్ని రోజులు హిమ, శౌర్యలు మూతి ముడుచుకుని ఉంటే.. ఇంకొన్ని రోజులు కార్తీక్ ఉంటాడు. మరొకొన్ని సార్లు కార్తీక్ సీరియస్ అవుతుంటాడు. అయితే మోనిత మాత్రం ఎప్పుడూ కార్తీక్ దీపల మధ్య చిచ్చు పెడుతూనే ఉంటుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ నంబర్ 1183 అక్టోబర్ 29న ఏం జరిగిందంటే..
కార్తీక్, సౌందర్యలు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. మోనితను బతికించాం.. సంతకం పెట్టి వచ్చామనే నిజాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. గుడికి వెళ్లామని అబద్దం చెప్పడం, నిజం తెలిసినా కూడా బయటపడని దీప వారు చెప్పిన అబద్దాన్ని కప్పి పుచ్చుతుంది. అయితే నేను ఏం పాపం చేశాను అత్తయ్యా? అని దీప అడగడంతో సౌందర్య, కార్తీక్ షాకవుతారు. నేను ఏం పాపం చేశాను అత్తయ్యా? నన్ను ఎందుకు గుడికి తీసుకెళ్లలేదు? అని దీప ఎమోషనల్ అవుతుంది.
ఇంకోసారి వెళ్తే కచ్చితంగా తీసుకెళ్తారు.. దానికే అంత పెద్ద మాటలు ఎందుకు దీప? అని మామ ఆనంద్ రావు అంటాడు. ఇక మొత్తానికి అక్కడికీ సన్ కట్ అవుతుంది. ఎందుకు ఇంత ప్రాణాలకు తెగించావ్.. కాసేపు అయితే నువ్ చచ్చే దానికి అంటూ మోనితతో భారతి అంటుంది. చావ లేదు కదా? అని మోనిత అంటుంది. నీ మొండి ధైర్యమేంటో గానీ.. కార్తీక్ నిన్ను నమ్ముతాడని అనుకుంటున్నావా? దీపను నమ్మడానికే పదకొండేళ్లు పట్టిందని భారతి అంటుంది.
అవన్నీ ఇప్పుడు నేను ఆలోచించడం లేదు.. నాకు భర్తగా అందులో సంతకం పెట్టాడు.. ఇక నా దిక్సూచి ఆ బాబే.. వాడి బారసాల చేయాలి అంటూ మోనిత తెగ మురిసిపోయింది. అక్కడ సీన్ కట్ చేస్తే కార్తీక్ మీద మళ్లీ ఓపెన్ అవుతుంది. తనలో తాను మథన పడుతున్న కార్తీక్ చుట్టూ ఇద్దరు పిల్లలు చేరుకుంటారు. రా నాన్న ఆడుకుందాం అని అంటాడు. ఇప్పుడు వద్దురా?అని కార్తీక్ అంటారు. నాతోనే దేవుడు చిత్రవిచిత్ర ఆటలు ఆడుతున్నాడు అని అంటాడు.
ఇక ఆనంద్ రావుకు ఏదో తేడా కొట్టడంతో సౌందర్యను అడుగుతాడు. పొద్దున్నుంచి ఎందుకలా తప్పించుకుని తిరుగుతుందో అడిగేశాడు. ఇక సౌందర్య కూడా జరిగిన మొత్తాన్ని ఆనంద్ రావుకు వివరించింది. దీంతో ఆనంద్ రావు కుప్పకూలిపోయాడు. ఇప్పటికే మనం దీపకు ఎంతో అన్యాయం చేశాం.. ఇప్పుడు ఇది కూడానా? ఇక మనం దీప కళ్లలోకి చూసి మాట్లాడగలమా? ఈ దరిద్రుడు ఎందుకు ఈ దౌర్భాగ్యపు పని ఎందుకు చేశాడు? ఇలాంటివి చూడటానికేనా? నేను బతికింది? అప్పుడే చచ్చిపోయినా బాగుండు అంటూ ఆనంద్ రావు కంటతడి పెడతాడు.
ఇక ఒంటరిగా బాల్కనీలో దీప మథన పడుతూ ఉంటుంది. ప్రియమణి చెప్పిన మాటలు, అత్త భర్త చెప్పిన అబద్దాలను తలుచుకుంటూ ఉంటుంది. ఏంటి దీప ఇక్కడ ఒంటరిగా ఉన్నావ్? అని కార్తీక్ అడుగుతాడు. ఎక్కడున్నా ఒంటరినే కదా? అని దీప అంటుంది. మీరు ఎందుకు అలా ఉన్నారు? మోనిత ఏమైనా? అని దీప పూర్తి చేసేలోపే కార్తీక్ ఫైర్ అయ్యాడు. ఎక్కడ చూడు మోనిత పేరేనా? నువ్ కూడా అదే మాట్లాడతావా? మన సంసారం గురించి మన గురించి వద్దా? అని అంటాడు అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
అయితే రేపటి ఎపిసోడ్లో మాత్రం అందరికీ దీప షాకిస్తుందా? అన్నది చూడాలి. ఇంట్లోనే ఫోన్ వదిలేసి? ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదని పిల్లలు కంగారు పడతారు. మరి దీపం నిజంగానే ఇంటి నుంచి బయటకు వెళ్లిందా? లేదా మళ్లీ ఏదో గుడికి వెళ్లి అలా తిరిగి వస్తుందా? అన్నది చూడాలి.