• November 1, 2021

Karthika Deepam Episode 1185 : ఝామ్ ఝామ్ అంటూ బారసాల.. మరో బాంబ్ వేయనున్న మోనిత

Karthika Deepam Episode 1185 : ఝామ్ ఝామ్ అంటూ బారసాల.. మరో బాంబ్ వేయనున్న మోనిత

    కార్తీకదీపం సీరియల్ సోమవారం నాడు మంచి రసవత్తరంగా ఉండనుంది. ఈ 1185వ ఎపిసోడ్‌లో దీప కనిపించడం లేదని కార్తీక్ మథనపడటం, కార్తీక్ శాంపిల్స్ తీసుకోవడానికే రాలేదు.. అవి మోనిత చేతుల్లోకి వెళ్లలేదనే నిజం తెలియడం, ఇక మోనిత పుట్టిన బిడ్డ పేగులు మెళ్లో వేసుకుని పుట్టాడని తెలియడం, శాంతి పూజలు చేయాలని ప్రియమణి చెప్పడం, మోనిత ఓ వైపు బారసాల అంటూ కలలు కనడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. సీరియల్ ఎపిసోడ్ ఎలా సాగిందంటే…

    దీప ఎక్కడికి వెళ్లి ఉంటుందా? అని సౌందర్య ఆనంద రావులు మాట్లాడుకుంటారు. ఈ ఇంటికి ఏదో అయింది.. ఏదో పట్టుకుంది.. అంటూ ఆనంద్ రావు తెగ బాధపడుతుంటారు. సౌందర్యతో ప్రియమణి అసలు విషయాన్ని చెప్పేస్తుంది. మోనిత ఫోన్ చేసింది.. అన్ని విషయాలు చెప్పింది. డాక్టర్ బాబు సంతకం చేశాడు.. మగబిడ్డ పుట్టాడు ఇలా అన్నీ చెప్పేసింది అని ప్రియ మణి అంటుంది. ఈ విషయాలన్నీ కూడా దీపకు చెప్పావా? అని అడుగుతుంది.

    చెప్పలేదు అని ప్రియమణి అబద్దం చెబుతుంది. దీపకు చెబితే చంపేస్తాను అని సౌందర్య భయపెడుతుంది. పేగు మెళ్లో వేసుకుని బిడ్డ పుట్టాడట.. రెండు మూడు వరసల చుట్టేసుకుని పుట్టాడట అంటే మేన మామలు, తండ్రికి గండం కదా? అదేదో శాంతి చేయించాలని అంటారు కదా? మేనమామలు లేరు తండ్రి అంటే మన డాక్టర్ బాబే కదా? అమ్మా.. అయినా అన్నీ మీకు తెలుసు.. నేను చెప్పాలా? అంటూ సౌందర్యకు చెప్పాల్సిందంతా చెప్పేసింది ప్రియమణి.

    ఆ తరువాత చాటుగా వెళ్లి మోనితకు ఫోన్ చేసింది ప్రియమణి. నాకు ఇక్కడ భయంగా ఉందమ్మా అని ప్రియమణి అంటుంది. భయం ఎందుకే.. ఇకపై భయపడాల్సింది వాళ్లు… మనం కాదు.. వాళ్లే పరుగులు తీస్తారు.. పరిగెత్తిస్తాను.. అంటూ మోనిత చెబుతుంది. నువ్ పని మనిషివే కాదే.. నా మనసు తెలుసుకుని చేసే మనిషి.. నేను ఉండగా నీకు భయం ఎందుకే అని మోనిత అంటుంది.

    దీప కనిపించడం లేదని భయపడుతున్నారట అని ప్రియమణి అంటే.. అది ఎక్కడికి వెళ్తుంది.. ఏదో మూలకు కూర్చుని ఏడుస్తుంటుంది అని మోనిత ఎగతాళి చేస్తుంది. ఎప్పుడు వస్తారు మేడం అని అంటే.. రేపో మాపో డిశ్చార్జ్ చేస్తారు అని మోనిత అంటుంది. ఇక్కడ కూర్చుని అక్కడి వాళ్లను ఆడిస్తా.. కూర్చోమంటే కూర్చుంటారు.. నిల్చోమంటే నిల్చుంటారు.. రిమోట్ నా దగ్గర ఉంది అని మోనిత అనుకుంటుంది.

    ల్యాబ్ డాక్టర్ రాజారాం, దీప మధ్య సంభాషణ జరుగుతుంది. రాజారాం నా పేరు.. నన్ను క్షమించాలి మేడప్.. మీకు జరిగిన అసౌకర్యానికి నన్ను క్షమించండి.. మాకు శాంపుల్స్ ఇచ్చి వెళ్లారు.. కానీ రిపోర్ట్స్ తీసుకోవడానికి రాలేదు.. రాకపోతే మోనితకు ఇస్తారా? అయ్యో ఎవ్వరికీ ఇవ్వలేదు మేడమ్. ఇలాంటివి సున్నిత అంశాలు.. ఎవ్వరికీ ఇవ్వం.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు.. తీసుకెళ్లలేదు..
    రిపోర్ట్స్‌లో ఏముందో కూడా తెలియదు.. ఇలా సీల్డ్ కవర్‌లో వస్తుంది.. ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేసి ఉంటారు.. లాబ్ మీద అతి పెద్ద ఆరోపణ.. మా నుంచి బయటకు వెళ్లదు.. ఈ విషయం ఎక్కడకు వచ్చి చెప్పమన్నా చెబుతాను అంటూ దీపతో ఆ డాక్టర్ అసలు విషయాన్ని చెప్పేశాడు.

    అలా డాక్టర్ చెప్పడంతో మోనిత, కార్తీక్ మాటలను తలుచుకుంటూ దీప.. ప్రియమణి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ధీనంగా వెళ్తుంది. బయట వారణాసి కూడా చెప్పకుండా అలా వెళ్లిపోతుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇంట్లో ఒంటరిగా కార్తీక్ పాత ఆలోచనలతో బాధపడుతుంటాడు.. దీప గురించి ఆలోచిస్తూ.. ఎక్కడికెళ్లావ్ దీప అంటూ మథనపడతాడు. ఎందుకలా ఉన్నావ్ అంటూ శౌర్య డాక్టర్ బాబును అడిగేస్తుంది.. అమ్మ బయటకు వెళ్లిందనా? అంటూ ధీనంగా అడుగుతుంది. ఇప్పుడు మేం నీతో బాగానే ఉంటున్నామ్ కదా? నాన్న.. మరి అమ్మ,నువ్ ఎందుకు బాగుండటం లేదు.. ఒకప్పుడే బాగా ఉన్నాం.. ఇప్పుడు కనీసం మీరు నవ్వడం కూడా లేదు.. నవ్వొచ్చు కదా? నవ్వితే బాగుంటావ్.. నవ్వే అదృష్టం నాకు పోయింది అని కార్తీక్ తన మనసులో అనుకుంటాడు. కొత్తగా అమ్మా అని పిలుస్తున్నావ్.. రౌడీ అని పిలువ్ నాన్న నాకు అలానే బాగుంటుంది అని శౌర్య ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది..

    అలా శౌర్య అంటుంటే.. పాత విషయాలన్నీ కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. ఒకప్పుడు దీపను అనుమానించి ఎంతలా అవమానించాడో తలుచుకుంటూ బాధపడ్డాడు. అనుమానం మాత్రమే మన జీవితాలను చిధిమేస్తుంది కదా? అంటూ ఫీలవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాటిని చూసి శౌర్య అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ నాన్న అని అంటే.. అవి కన్నీళ్లకాదు.. ఆనంద భాష్పాలు అని చెబుతాడు. అవి ఎందుకు వస్తాయి నాన్న అని అడుగుతుంది.. ఏడ్చే వాళ్లకు నవ్వే అదృష్ణం.. నవ్వేవాళ్లకు ఏడ్చే అదృష్టం ఉండదు.. అందుకే అలా దేవుడి ఇద్దరికీ కన్నీళ్లు ఇస్తాడు అని అంటాడు.. అర్థం కాలేదా?.. కొన్ని అర్థం కాకపోవడడే మంచిది అని వేధాంత ధోరణిలో డాక్టర్ బాబు మాట్లాడేస్తాడు.

    ఇక లాబ్ బయట ఎదురుచూసిన వారణాసికి.. దీప ఎప్పుడో వెళ్లిపోయిందని తెలుస్తుంది. ఎటు వెళ్లిందో తెలియక వారణాసి కంగారు పడతాడు. అక్కడ సీన్ కట్ చేస్తే హాస్పిటల్‌లో భారతి, మోనిత మాటల సీన్ మొదలవుతుంది. బారసాల గురించి మోనిత కలలు కంటుంది. కొంపదీసి బారసాల చేస్తావా? అని భారతి అంటే.. కొంపదీయకుండా కాదు.. ఝామ్ ఝామ్ అని చేస్తా అని మోనిత అంటుంది.. ఇవన్నీ అవసరమా? అని భారతి అంటే.. వీడేం అనాథ కాదు.. ది గ్రేట్ ఆనంద రావు,, సౌందర్య, కార్తీక్ వారసత్వం.. వీడు లీగల్.. అన్ని అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవాలి అని మోనిత అంటుంది.

    ఇంత స్పీడ్ వద్దు.. దీపను చూశావా? ఏ తప్పు చేయకపోయినా కార్తీక్ అలా చేసినా.. ఒక్క మాట మాట్లాడకుండా పదకొండేళ్ల తరువాత గెలిచింది అని భారతి అంటుంది.. అయ్యో భారతి.. నువ్ ఇంకా కలలు కంటూనే ఉన్నావ్.. దాని పిల్లల్లా వీడిని చేయను.. అంటూ మోనిత చెబుతుంది. గొడవలు సృష్టించుకోకు.. సమయాన్ని చూసుకుంటూ వెళ్లు అని భారతి చెబితే.. అవకాశాలను సృష్టించుకుంటాను అని మోనిత అంటుంది..

    ఆశ్రయం ఇచ్చావని, సాయం చేశావని జ్ఞాన బోధ చేయకు.. నేనేం నిన్ను సలహా అడగలేదు.. నీలో మార్పు వచ్చింది.. నువ్ నాకంటే ఎక్కువగా దీప మీద జాలి పడుతున్నావ్..నీలా నేను దీప మీద జాలి పడితే.. అడుగు ముందుకు వేయలేను.. అయినా దీపకు నాకు తేడా ఏంటి? దీప తాళి కట్టించుకుంది అంతే కదా ? అని మోనిత అంటుంది.. నేను చెప్పేది చెప్పాను.. ఆ తరువాత నీ ఇష్టం అని భారతి అంటుంది.. త్వరలోనే నేను అనుకున్నది సాధిస్తాను.. ఆల్రెడీ బాణం వేశాను.. రేపు మా అత్తగారు శాంతి పూజ చేస్తారు.. అదే నా తొలివిజయం.. నాకు వీడికి ఇక తిరుగే ఉండదు.. మీ నానమ్మ నీకు పూజ చేయిస్తుందా? అంటూ మోనిత తన కొడుకును చూసి తెగ మురిసిపోతుంది.

    Leave a Reply