- October 28, 2021
Karthika Deepam Episode 1182 : లీగల్‌గా భర్త అయిన కార్తీక్.. దీప బతుకు బుగ్గిపాలే

కార్తీకదీపం సీరియల్ మొత్తం కూడా కార్తీక్, దీప, మోనితల చుట్టే తిరుగుతోంది. ఇన్నాళ్లకు కార్తీక్‌ను లీగల్‌గా తన భర్తను చేసుకుంది మోనిత. కపటనాటకంతో సౌందర్యను నమ్మించడంతో అసలు కథ అడ్డం తిరిగింది. చావు బతుకుల్లో ఉండగా అబద్దాలు ఎందుకు చెబుతాను అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేసింది. సౌందర్యను నమ్మించింది. కార్తీక్ చేత ఆపరేషన్‌కు సంతకం పెట్టించింది. దీంతో లీగల్‌కు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా, మోనితకు భర్తగా కార్తీక్ అయిపోయినట్టే.
అక్టోబర్ 28వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో స్థూలంగా జరిగేది ఇదే. మొత్తానికి మోనిత, డాక్టర్ భారతీ వేసిన స్కెచ్‌లో కార్తీక్ ఇరుక్కున్నాడు. సౌందర్య కూడా గుడ్డిగా ఆడదాని మాటలను సాటి ఆడదానిగా నమ్మేసింది. తానే నిజంగా మైకం మత్తులో అలా చేశానా?అనేంతగా కార్తీక్ పునారోచనలో పడ్డాడంటే మోనిత ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేసి ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి సంతకం పెట్టేసి అఫీషియల్‌గా భర్త అయ్యాడు మోనితకు.
ఈ విషయాన్ని ప్రియమణి చేరవేసింది. దీపకు మెల్లిగా ఎక్కించేసింది. కార్తీక్ బాబు దేవుడంటూ.. మోనిత, ఆమె బిడ్డను కాపాడాడు అంటూ అసలు విషయాన్ని చెప్పేసింది. దీంతో దీప కుప్పకూలిపోతోంది. నాకు అబద్దం చెప్పి హాస్పిటల్‌కు వెళ్లారా? అంటూ దీప తెగ బాధపడుతుంది. ఇక దీప గతంలో జరిగిన విషయాలు మోనిత, కార్తీక్ మధ్య ఉన్న సంబంధం, ప్రియమణి చెప్పిన మాటలను పదే పదే తలచుకుంటూ ఎమోషనల్ అవుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్‌లో దీప తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. తనకు నిజం తెలియన్నట్టుగా నాటకాలు ఆడింది. గుడికి వెళ్లారా? దర్శనం బాగా జరిగిందా? అంటూ నిజం చెబుతారేమోనని దీప పరీక్షించినట్టుంది. మొత్తానికి దీప బతుకు చీలేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.